మీరు వాట్సాప్ గ్రూప్‌లో అడ్మిన్స్‌గా ఉన్నారా..! అయితే మీకో గుడ్‌న్యూస్...! వాట్సాప్ గ్రూప్స్‌ను దృష్టిలో ఉంచుకొని మెటాకు చెందిన వాట్సాప్ త్వరలోనే అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
ఇతరుల మెసేజ్‌లను డిలీట్..!
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం..వాట్సాప్ గ్రూప్‌లోని సదరు యూజర్ షేర్ చేసిన సందేశాలను తొలగించడానికి గ్రూప్ అడ్మిన్‌లను అనుమతించే ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోందని నివేదించింది. ఇలాంటి మోడరేషన్ పీచర్ టెలిగ్రాం యాప్‌లో అందుబాటులో కలదు. ఈ ఫీచర్‌కు సంబంధించిన విషయాలను వాట్సాప్ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. WABetaInfo ప్రకారం...ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన్‌లలో వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం ...గ్రూప్స్‌లోని సదరు యూజరు పంపిన సందేశాలను అడ్మిన్స్ డిలీట్ చేసే ఫీచర్‌ను ట్విటర్‌లో షేర్ చేసింది. సదరు యూజర్ పంపిన మెసేజ్‌ను గ్రూప్ అడ్మిన్స్ డిలీట్ చేశారనే విషయాన్ని గ్రూప్ సభ్యులకు తెలియజేస్తుందని పేర్కొంది. ప్రస్తుతానికి, గ్రూప్ అడ్మిన్‌లు గ్రూప్‌లోని పాత మెసేజ్‌లను తొలగించగలరా లేదా అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. వినియోగదారులు ప్రస్తుతం వారి స్వంత సందేశాలను పర్సనల్ చాట్‌లో లేదా గ్రూప్స్‌లో ఒక గంట, ఎనిమిది నిమిషాల, 16 సెకన్లలో తొలగించగలరు.
అడ్మిన్స్‌కు ఊరట..!
వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్‌తో అడ్మిన్స్‌కు భారీ ఊరట కలిగే అవకాశం ఉంది. గ్రూప్స్‌లో నకిలీ వార్తలు లేదా హానికరమైన కంటెంట్‌లను అరికట్టడానికి గ్రూప్ అడ్మిన్స్‌కు తోడ్పడనుంది. గతంలో వాట్సాప్ గ్రూప్స్‌లో సదరు యూజర్లు పెట్టే మెసేజ్‌లకు పూర్తి బాధ్యత గ్రూప్ అడ్మిన్స్‌దేనని ప్రభుత్వం తెలిపింది. దీనిపై బాంబే, మద్రాస్ హైకోర్టులు గ్రూప్ అడ్మిన్స్‌కు ఊరట కల్పించాయి. వాట్సాప్ గ్రూప్‌లో ఇతర సభ్యులు అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తే గ్రూప్ అడ్మిన్స్‌ను బాధ్యులుగా చూడలేమని పేర్కొన్నాయి.
If you are a group admin, you will be able to delete any message for everyone in your groups, in a future update of WhatsApp beta for Android.
— WABetaInfo (@WABetaInfo) January 26, 2022
A good moderation, finally. #WhatsApp pic.twitter.com/Gxw1AANg7M
చదవండి: ఈ యాప్స్ వాడుతున్నారా.. అయితే, మీ మొత్తం డేటా కంపెనీల చేతుల్లోకి!
Comments
Please login to add a commentAdd a comment