
ఖైదీతో పాటు నలుగురు పోలీసులు మృతి
పోలీస్ వ్యాన్ ఓ ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు.
పాట్నా: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీస్ వ్యాన్ ఓ ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ముజఫర్‌పూర్‌లో శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగింది. పోలీస్ వ్యాన్‌లో వెళ్తున్న నలుగురు పోలీసులతో పాటు.. ఓ ఖైదీ ఈ ప్రమాదంలో మృతి చెందారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు గల్లంతయ్యారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కెనాల్‌లో పడిపోయింది. ప్రవాహవేగం ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైనవారి కోసం గాలింపు చేపడుతున్నట్లు వెల్లడించారు.