లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో బీజేపీ నేతలపై ఉన్న కేసులు ఎత్తేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారు. కేసుల ఎత్తివేతపై ముజఫర్‌నగర్ జిల్లా మెజిస్ట్రేట్‌తో పాటు ఎస్‌ఎస్పీ అభిప్రాయాలను కోరుతూ యూపీ ప్రభుత్వం ఈ నెల 5న లేఖ రాసినట్లు తెలిసింది. ముజఫర్‌నగర్ అల్లర్లలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లకు సంబంధించి ప్రస్తుత యూపీ మంత్రి సురేశ్ రాణా, మాజీ కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్, ఎంపీ భరతేందు సింగ్, ఎమ్మెల్యే ఉమేశ్ మాలిక్, సాధ్వీ ప్రాచీలపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment