pullout
-
కొనసాగుతున్న ఎఫ్‌పీఐ అమ్మకాలు
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీయంగా ఈక్విటీలను విక్రయించడం కొనసాగిస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం .. నవంబర్‌లో ఇప్పటివరకు (1 నుంచి 10వ తేదీ వరకు) రూ. 5,800 కోట్ల మేర అమ్మేశారు. ఇప్పటికే అక్టోబర్‌లో రూ. 24,548 కోట్లు, సెపె్టంబర్లో 14,767 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దాని కన్నా ముందు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (మార్చి నుంచి ఆగస్టు వరకు) దాదాపు రూ. 1.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు, అక్టోబర్‌లో డెట్ మార్కెట్లో రూ. 6,381 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6,053 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఈక్విటీల్లో రూ. 90,161 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 41,554 కోట్లకు చేరాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లు పెరగడం వంటి అంశాల కారణంగా ఎఫ్‌పీఐల విక్రయాల ధోరణి కొనసాగుతోందని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడి ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసే వరకు నిధులను స్వల్పకాలికంగా డెట్ మార్కెట్లోకి మళ్లించే వ్యూహాన్ని మదుపుదారులు అమలు చేస్తున్నట్లు పరిశీలకులు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలు మెరుగైన క్యూ2 ఫలితాలు ప్రకటిస్తూ, ఆశావహ అంచనాలు వెలువరిస్తున్నప్పటికీ ఎఫ్‌పీఐలు వాటిలో అత్యధికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ స్టాక్స్ వేల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోరీ్నకి యాష్లే బార్టీ దూరం
మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ నుంచి ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ యాష్లే బార్టీ వైదొలిగింది. వచ్చే నెల 10 నుంచి 17 వరకు మెక్సికోలని గ్వాడాలహారా నగరంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లోని టాప్–8 క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. ‘వచ్చే ఏడాదిలో కొత్త ఉత్సాహంతో బరిలో దిగేందుకు సీజన్ ముగింపు టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను’ అని 25 ఏళ్ల బార్టీ తెలిపింది. ఈ సీజన్లో బార్టీ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీతో కలిపి మొత్తం ఐదు టైటిల్స్ సాధించి ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనుంది. -
డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై విరుచుకుపడ్డారు..
-
ముజఫర్‌నగర్ కేసుల ఎత్తివేత?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో బీజేపీ నేతలపై ఉన్న కేసులు ఎత్తేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారు. కేసుల ఎత్తివేతపై ముజఫర్‌నగర్ జిల్లా మెజిస్ట్రేట్‌తో పాటు ఎస్ఎస్పీ అభిప్రాయాలను కోరుతూ యూపీ ప్రభుత్వం ఈ నెల 5న లేఖ రాసినట్లు తెలిసింది. ముజఫర్‌నగర్ అల్లర్లలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లకు సంబంధించి ప్రస్తుత యూపీ మంత్రి సురేశ్ రాణా, మాజీ కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్, ఎంపీ భరతేందు సింగ్, ఎమ్మెల్యే ఉమేశ్ మాలిక్, సాధ్వీ ప్రాచీలపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. -
కశ్మీర్‌లోయలో ఆంక్షలు ఎత్తివేత
-
4 చెక్‌పోస్టులు ఎత్తివేత
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని అటవీశాఖ చెక్‌పోస్టుల్లో అక్రమాలను సంస్కరించే చ ర్యల్లో భాగంగా.. జిల్లాలో అక్రమాలకు అ డ్డాగా మారాయనే ఆరోపణలు ఎదుర్కొం టున్న నాలుగు చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ జిల్లా ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ వాకాటి కరుణ శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేశారు. దీంతో సౌత్ ఫారెస్ట్ విభాగానికి చెందిన నర్సంపేట చెక్‌పోస్టు, నార్త్ విభాగానికి చెందిన చెల్పూరు, జంగాలపల్లి చెక్‌పోస్టులు, వన్యప్రాణి భాగానికి చెందిన కొత్తగూడ చెక్‌పోస్టులను ఎత్తివేశా రు. కమిటీలో కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, వరంగల్ ఎస్పీ, ఐటీడీఏ పీఓ, డీఎఫ్ఓ సభ్యులు గా ఉంటారు. కాగా జిల్లాలో చెక్‌పోస్టుల అవీనీతి, సంస్కరణల కోసం పరిశీలన సిఫారసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రసుతం మూతపడ్డ చెక్‌పోస్టుల్లోని సిబ్బందిని అవసరం ఉన్న బీట్లకు కేటాయించారు. -
ఉద్యమ వీరులకువీడని సంకెళ్లు!
♦ ఎత్తివేయని కేసులు.. కోర్టుల చుట్టూ చక్కర్లు ♦ తెలంగాణ ఉద్యమకారులకు తీరని మనోవేదన ♦ కొందరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ జిల్లాలో నమోదైన 63 కేసుల్లో 59 రద్దు చేసిన ప్రభుత్వం మూడింటిని ఇప్పటికీ ఎత్తివేయలేదు. వాటిని రద్దు చేయాలంటూ ఉద్యమకారులు టీఆర్ఎస్ అధినాయకత్వం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపో యింది. కొన్నాళ్లపాటు కోర్టుకు హాజరుకాని వారికి ఈ మధ్య నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. నాతోపాటు పది మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి మంత్రి వర్గ సమావేశంలో ఉద్యమకారులపై నమోదైన అన్ని కేసులను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ జిల్లాలో ఇంకా కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. కేసులు ఎత్తివేశారని భావించి కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. - శుభప్రద్‌పటేల్, టీఆర్ఎస్ నేత సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా.. ఉద్యమమే ఊపిరిగా.. నిప్పు కణికలా పనిచేసిన ఉద్యమవీరులను కేసుల సంకెళ్లు వీడడంలేదు. సకల జనుల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లయినా వారికి కేసుల నుంచి విముక్తి కలగలేదు. అధికార ం లోకి వచ్చిన మరుక్షణమే బేషరతుగా కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. దీంతో అరెస్టులు, వారెంట్లతో మానసిక క్షోభ అనుభవిస్తున్న ఉద్యమకారులకు తీరని మనోవేదన మిగులుతోంది. జిల్లావ్యాప్తంగా నమోదైన 63 కేసుల్లో 59 రద్దు చేసిన ప్రభుత్వం మూడింటిని మాత్రం ఇప్పటికీ ఎత్తివేయలేదు. ఈ మూడు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న 24 మంది తమపై పెట్టిన కేసులు రద్దు చేయమని నిత్యం సచివాలయంలోని మంత్రుల పేషీల చుట్టూ చక్కర్లు కొడుతున్నా ఫలితం కనిపించడంలేదు. ఈ కేసుల బాధితుల్లో వికారాబాద్‌కు చెందిన శుభప్రద్‌పటేల్ బృందం ఒకటి. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమానికి టీఎస్‌జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా నాయకత్వం వహిం చిన పటేల్ సహా పలువురిపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 32 కేసులు నమోదయ్యాయి. గంగ్యాడలో అప్పటి కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిపై కోడిగుడ్లు విసిరిన కేసుతోపాటు.. అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్న సంఘటనలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. పరిగిలో చంద్రబాబు కాన్వాయ్‌పై దాడిచేసిన ఘటన.. అసెంబ్లీ ముట్టడి, సాగరహారం, మిలియన్ మార్చ్, ఖలేజా సినిమా షూటింగ్ సెట్టింగ్ దగ్ధం ఇలా అనేక ఘటనల్లో పటే ల్‌పై రకరకాల సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇలా తెలంగాణ ఉద్యమంతో ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారిన శుభప్రద్పై అప్పటి సర్కారు.. ‘బీ’షీట్ తెరిచింది. తద్వారా అసాంఘిక శక్తిగా ముద్రవేస్తూ.. ఆయన కదలికలపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పడడంతో కేసులన్నీ మాఫీ అవుతాయని భావించిన పటేల్‌కు నిరాశే మిగిలింది. ఆయనతోపాటు మరో 24 మందిపై ఇంకా మూడు కేసులు రద్దు చేయకపోవడంతో ఉద్యోగాలు, పదవుల సాధన ప్రయత్నంలో ఉన్న ఆ నిరుద్యోగులకు ప్రతిబంధకంగా మారాయి.