4 చెక్‌పోస్టులు ఎత్తివేత
Published Fri, Jul 29 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని అటవీశాఖ చెక్‌పోస్టుల్లో అక్రమాలను సంస్కరించే చ ర్యల్లో భాగంగా.. జిల్లాలో అక్రమాలకు అ డ్డాగా మారాయనే ఆరోపణలు ఎదుర్కొం టున్న నాలుగు చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ జిల్లా ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ చైర్‌పర్సన్, కలెక్టర్ వాకాటి కరుణ శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేశారు. దీంతో సౌత్ ఫారెస్ట్ విభాగానికి చెందిన నర్సంపేట చెక్‌పోస్టు, నార్త్ విభాగానికి చెందిన చెల్పూరు, జంగాలపల్లి చెక్‌పోస్టులు, వన్యప్రాణి భాగానికి చెందిన కొత్తగూడ చెక్‌పోస్టులను ఎత్తివేశా రు. కమిటీలో కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, వరంగల్ ఎస్పీ, ఐటీడీఏ పీఓ, డీఎఫ్‌ఓ సభ్యులు గా ఉంటారు. కాగా జిల్లాలో చెక్‌పోస్టుల అవీనీతి, సంస్కరణల కోసం పరిశీలన సిఫారసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రసుతం మూతపడ్డ చెక్‌పోస్టుల్లోని సిబ్బందిని అవసరం ఉన్న బీట్లకు కేటాయించారు.
Advertisement
Advertisement