ముజఫర్‌నగర్‌ అత్యాచారాలపై ఆమ్నెస్టీ నివేదిక | Amnesty report on rape in Muzaffarnagar | Sakshi
Sakshi News home page

ముజఫర్‌నగర్‌ అత్యాచారాలపై ఆమ్నెస్టీ నివేదిక

Published Fri, Feb 10 2017 1:40 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

Amnesty report on rape in Muzaffarnagar

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 2013 నాటి అల్లర్ల సమయంలో మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారాలపై జరుగుతున్న విచారణలో జాప్యం.. బాధితుల దయనీయ స్థితిని తెలియజేస్తోందంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ భారత విభాగం గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. ‘లాసింగ్‌ ఫెయిత్‌: ద ముజఫర్‌నగర్‌ గ్యాంగ్‌రేప్‌ సరై్వవర్స్‌’పేరుతో తీసుకువచ్చిన ఈ నివేదిక, మహిళలను దాడుల నుంచి రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది.

ఆ తర్వాత కేసుల విచారణ స్థితి గురించి బాధితులకు సమాచారం అందించడంలోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆక్షేపించింది. మత, కుల ఘర్షణల్లో మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు కావడం ఇదే తొలిసారి కాబట్టి, ఈ కేసులను ప్రభుత్వమే నీరుగారుస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో పోలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement