గుర్తుతెలియని యువకుడి దారుణ హత్య | Brutal murder of a young man | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని యువకుడి దారుణ హత్య

Published Sat, Feb 7 2015 12:42 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

గుర్తుతెలియని యువకుడి దారుణ హత్య - Sakshi

గుర్తుతెలియని యువకుడి దారుణ హత్య

డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో పోలీసుల వేట
కొడుపాక శివారులో కలకలం

 
పాపన్నపేట: మండల పరిధిలోని కొడుపాక శివారులో గుర్తు తెలియని పాతికేళ్ల యువకుడు శుక్రవారం తెల్లవారు జామున దారుణ హత్యకు గురయ్యాడు. పదునైన ఆయుధాలతో గొంతుకోసి తలపై నరికి చంపారు. గ్రామ శివారులో కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన హంతకులను పట్టుకునేందుకు పోలీసు లు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో వేట ప్రారంభించారు. మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్‌ఐ శ్రీకాంత్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కొడుపాక శివారులో రోడ్డు పక్కనే గల వరిపొలాల్లో తీవ్రగాయాల పాలైన గుర్తు తెలియని యువకుడు కొన ఊపిరిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఉదయం ఇది గుర్తించిన స్థానిక రైతులు 108కు సమాచారం అందించారు. ఉదయం 9 గంటల వరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకునేలోగానే బాధితుడు మృత్యువాత పడ్డాడు. అతని జేబుల్లో వెతికినా ఎలాంటి ఆధారాలు లభించలేదు.

ఒంటిపై ఆకుపచ్చ ఫుల్ షర్ట్, నలుపురంగు జీన్స్‌ప్యాంట్ ఉన్నా యి. బెల్టు బకెల్‌పై ఆర్ అనే అక్షరం ఉంది. ఎడమచేతి మడమపై ఆంగ్లలో కె.ఎస్. అనే అక్షరాలు, కుడిచేతి బొటనవేలిపై కె.ఎస్.సాయి అనే అక్షరాలు, కుడిచేతి భుజంపై ఓం ఆకారంలో పచ్చబొట్లు ఉన్నాయని ఎస్‌ఐ వివరించారు. కాగా సంఘటన స్థలాన్ని క్లూస్‌టీం సిబ్బంది వెంకటేశ్వర్లు, నర్సింలు, డాగ్‌స్క్వాడ్ అధికారులు సందర్శించి పరిశోధన ప్రారంభించారు. సదరు యువకుడిని హత్య చేసిన చోట పెనుగులాడిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గొంతు, తలపై పదునైన ఆయుధాలతో దాడి చేయడం వల్ల అతడు మరణించి ఉంటాడని పోలీసులు అనుకుంటున్నారు.ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగి ఉం టుందని భావిస్తున్నారు. మృతుడు సమీప జిల్లాల కు చెందిన వాడైఉంటాడని  పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement