* తుజాల్‌పూర్‌లో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి
* మృతుని ట్రాక్టర్ ఇంజన్ సైతం దహనం
* చంపి ఉరివేశారని కుటుంబసభ్యుల ఆరోపణ
* డాగ్‌స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు
* తుజాల్‌పూర్‌లో కలకలం
దోమకొండ : మండలంలోని తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన సుంకరి వెంకట్‌గౌడ్(35)అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే మృతదేహం ఉన్న తీరును బట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉరేసి ఉంటారని కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మృతునికి చెందిన ట్రాక్టర్ ఇంజన్ సైతం ఇదే రోజు దహనం కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వివరాల్లోకి వెళితే వెంకట్‌గౌడ్ తన భార్య లావణ్యతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి వరకు తాగునీటి మోశాడు.
అయితే తెల్లవారుజామున నిద్ర లేచిన భార్యకు భర్త కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారు గ్రామంలో వెతికగా గ్రామ శివారులో ఎల్లమ్మగుడికి వెళ్లే దారిలో చెట్టుకు ఉరేసుకున్నట్లు వెంకట్‌గౌడ్ మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న భిక్కనూర్ సీఐ శ్రీధర్‌కుమార్, దోమకొండ ఎస్సై శోభన్‌బాబు, బీబీపేట ఏస్సైలు నరేందర్, రాంప్రసాద్‌లు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
నిజామాబాద్ నుంచి డాగ్‌స్వ్కాడ్‌ను పిలిపించి సంఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించారు. కాగా వెంకట్‌గౌడ్‌ను కావాలనే ఎవరో చంపి ఉరివేశారని మృతుని భార్య లావణ్య, తండ్రి బాల్‌రాజ్, తల్లి పోశవ్వలు ఆరోపించారు. మృతదేహం కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఇది హత్యా..? లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు గ్రామంలో గీత కార్మికునిగా పనిచేస్తున్నారు.
మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డిలో పోస్టుమార్టం వద్ద డీఎస్పీ భాస్కర్ మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సంఘటన గ్రామంలో కలకలం సృష్టించింది.
చంపి ఉరేశారా..?
Published Sun, Jan 4 2015 3:26 AM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM
Advertisement
Advertisement