యువకుడి దారుణ హత్య
నిజాంసాగర్ : మండలంలోని నర్వ గ్రామానికి చెందిన పెంటబోయిన నాగరాజు (27) అనే యువకుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబీకుల ప్రోద్బలంతో స్నేహితులు ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ద్వారా తెలిసింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నర్వ గ్రామానికి చెందిన పెంటబోయిన ఎల్లవ్వ మనుమడు నాగరాజు వ్యవసాయ పనులు చేసుకుంటూ మద్యానికి బానిసగా మారాడు. చిన్ననాటి నుంచి మద్యం సేవించడంతో కుటుంబంలో తరుచూ తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. చెడువ్యసనాలకు బానిసగా మారిన నాగరాజు పరివర్తనలో మార్పురాకపోవడంతో ఐదేళ్ల కిందట ఓ యువతితో పెళ్లి జరిపించారు.
అయినా నాగరాజులో మార్పు కన్పించలేదు. రోజూ మద్యం సేవించి వచ్చి భార్యను, కుటుంబీకులను కొట్టేవాడు. భర్త చిత్రహింసలను భరించలేక మొదటి భార్య విడాకులు తీసుకుంది. ప్రతిరోజూ మద్యం సేవించడంతో పాటు పక్కగ్రామాల్లో పేకాట ఆడుతూ ఆస్తిని గుల్ల చేశాడు. కాగా మూడేళ్ల కిందట మమహమ్మద్‌నగర్‌కు చెందిన మమతతో రెండో పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి కొద్దిరోజుల పాటు నాగరాజు లో మార్పుకన్పించింది. వీరికి ఏడాదిన్నర కింద ట బాలుడు పుట్టాడు. కొద్దిరోజులకు మళ్లీ మ ద్యానికి బానిసై భార్య తో పాటు కుటుంబీకుల తో గొడవపడుతూ దాడి చేసేవాడు.
ఈ విషయ మై రెండు సార్లు నాగరాజుపై కుటుంబ సభ్యులు పోలీ స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కొన్నేళ్ల నుంచి చిత్రహింసలను భరిస్తున్న కుటుంబీకులు నాగరాజును హత మార్చడానికి వారం రోజుల కిందట పథకం పన్నారు. రోజులాగే మద్యం సేవించి వచ్చిన నాగరాజు కుటుం బీకులతో గొడవపడ్డాడు. ఇదే అదునుగా భావించినకు టుంబీకులు నాగరాజు హత్యకోసం ప్రయత్నాలు చేశా రు. నాగరాజు స్నేహితులైన ఇదే గ్రామానికి చెందిన బోండ్ల మచ్చెందర్, రుద్ర రాంచందర్‌లను కుటుం బీకులు ఇంటికి పిలిచారు. చిత్తుగా మద్యం తాగి ఉన్న నాగరాజును హతమార్చాలని వారిని కోరారు. కుటుం బీకుల సహకారంతో ఇంట్లోనే నాగరాజు గొంతు, మర్మాంగాలను కుటుంబీకులు, స్నేహితులు నులిమి దాడి చేసి హత్య చేశారు.
హత్య విషయం బయటకు పొక్కకుండా నాగరాజు మృతదేహాన్ని ఇంటి కొద్దిదూరంలో ఉన్న చింతచెట్టు కిందపడేశారు. వేకువజామున నిద్రలేచిన కుటుంబీకులు చింతచెట్టుకింద నాగరాజు హత్యకు గురైనట్లు గ్రామస్తులను నమ్మబలికారు. చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహన్ని పరిశీలించి హత్యగా భావించారు. ఈ విషయమై స్థానికులు కుటుంబీకులను ప్రశ్నించగా తమకు ఎవరిపైనా అనుమానాలు లేవని, పోలీసులకు ఫిర్యాదు వద్దన్నారు. చివరకు బంధువుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్సై అంతిరెడ్డి సంఘటనస్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. విషయాన్ని బాన్సువాడ రూరల్ సీఐ రమణారెడ్డికి చేరవేశారు.
దీంతో సీఐ అక్కడికి చేరుకొని జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. అప్పటికే కుటుంబీకులను అనుమానించగా హత్య నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. డాగ్ స్వ్కాడ్ ఘటన స్థలం నుంచి ఇంట్లోకి వెళ్లి కుటుంబీకులను పట్టుకుంది. ఈ మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మమతతో పాటు చిన్నమ్మ మంజుల, అమ్మమ్మ ఎల్లవ్వ, స్నేహితులు రాంచందర్, మచ్చెందర్‌లపై కేసునమోదు చేసినట్లు ఎస్సై అంతిరెడ్డి తెలిపారు. హంతకులు పరారిలో ఉన్నారని పోలీసులు తెలిపారు.