Naga raju
-
Pallipattu Nagaraju: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి..
జీవితాన్ని కాచి వడబోసిన అనుభవం.. అడుగడుగునా కనిపించే వివక్ష నుంచి రగిలిన అగ్ని కణం.. కనుచూపు మేరలో కనిపించే అణచివేతను కూకటి వేళ్లతో పెకలించాలనే ఆక్రోశం.. పేదల పక్షాన పోరాటమై.. పీడిత జన పిడికిలై.. కవిత్వమే ఆయుధమై.. అక్షర సూరీడయ్యాడు.. నేను, నా కుటుంబం కాకుండా, మనం.. సమాజం అనుకొని ఎక్కుపెట్టిన ఆ కలం చైతన్య తూటాలను పేల్చింది.. నవ సమాజ నిర్మాణానికి తన వంతు బాధ్యతగా అక్షర యుద్ధం చేస్తున్న పల్లిపట్టు నాగరాజును కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించడం.. ఉమ్మడి చిత్తూరు జిల్లా చరిత్రలో ఇదే తొలి పురస్కారం కావడం విశేషం. తిరుపతి కల్చరల్/శాంతిపురం: నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన భూలక్ష్మి, రాఘవయ్య దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు పల్లిపట్టు నాగరాజు పాఠశాల విద్యను వెంకటాపురంలో పూర్తి చేసి, సత్యవేడు జూనియర్ కళాశాలలో ఇంటర్, తిరుపతి ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ(స్పెషల్ తెలుగు) చదివారు. కర్నూలు ఐఏఎస్ఈ కాలేజీలో తెలుగు పండిట్ శిక్షణ పొందారు. తిరుపతి ఎస్వీయూలో ఏంఏ తెలుగు ఉత్తీర్ణులై.. ప్రస్తుతం ఆచార్య మేడపల్లి రవికుమార్ పర్యవేక్షణలో విల్సన్ సుధాకర్ రచనలపై పీహెచ్డీ చేస్తున్నారు. 2016 జూన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శాంతిపురం మండలంలోని 64.పెద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. చిన్నప్పటి నుంచే రచనలపై ఆసక్తి తల్లిదండ్రుల కష్టంతోపాటు చుట్టుపక్క ప్రజల జీవన శైలి నాగరాజు రచనలపై ఎనలేని ప్రభావం చూపింది. సమాజంలో సగటు మనిషి బాధలే తన బాధగా కవితలను అక్షరీకరించాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడంతో పీడిత జనానికి తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలని అక్షరాలనే ఆయుధంగా మలుచుకున్నాడు. శ్రీశ్రీ, తిలక్ రచనల స్ఫూర్తితో తనదైన శైలిలో పల్లె భాషకు జీవం పోస్తూ సామాన్య పదాలతో అసామాన్య కవితలకు జీవం పోశాడు. అవ్వ చెప్పిన ఆ కథలే.. చిన్నప్పుడు అవ్వ మంగమ్మ చెప్పే జానపద కథలు, బుర్ర కథలు, దేవుళ్ల కథలు, దెయ్యాల కథలు, బూతు కథలు, నీతి కథలు, తమాషా కథలు.. నాగరాజు ఊహకు పదునుపెట్టాయి. బహుజనుల శ్రమతత్వం కవితకు ప్రేరణ కలిగించాయి. పాఠశాల స్థాయి నుంచే చిన్న చిన్న కవితలు, పాటలకు పేరడీలు రాసేందుకు సన్నద్ధం చేశాయి. ఏదో చేయాలని.. పోరాటంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కోణం. కొందరు తుపాకీ పడతారు, కొందరు శాంతి బాట పడతారు. ఇంకొకరు ఇంకొకటి.. ఇలా నాగరాజు ఎంచుకున్న బాట కవిత్వం. అక్షర శక్తి తెలిసిన వ్యక్తిగా పీడిత జనం పక్షాన నిలిచి అక్షర సేద్యం చేశారు. ఇలా రూపుదిద్దుకున్నదే ‘యాలైపూడ్సింది’. తొలి వచన కవితా సంపుటి 2021, జనవరి 31న కవి సంగమం ప్రచురణల ద్వారా తిరుపతిలో ఆవిష్కృతమైంది. ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది సామాన్య శ్రమజీవుల జీవన విధానాలను అక్షరాలుగా పేర్చి కూర్చిన తొలి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. తొలి రచనకే అనూహ్యంగా యువ పురస్కారం రావటం నా బాధ్యతను తెలియజేస్తోంది. సామాన్యుల కష్టాలు, వారి నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితులే కథావస్తువులుగా రచనలు కొనసాగిస్తాం. ఇది నా తల్లిదండ్రుల శ్రమకు తగిన ఫలితం. శ్రమ జీవులు, బహుజనుల జీవితాల సంఘర్షణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. తల్లిదండ్రులకు ఈ అవార్డును అంకితమిస్తా. – పల్లిపట్టు నాగరాజు -
సంచలన కేసు; మూడో నిందితుడు అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ అవినీతి కేసులో మూడో నిందితుడు కందాడి శ్రీకాంత్‌రెడ్డి (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన ఇంట్లోనే నిర్జీవంగా పడివున్న అతడిని పోలీసులు గుర్తించారు. ఆదివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగార్జుననగర్ కాలనీకి చెందిన కందాడి శ్రీకాంత్‌రెడ్డి (37) వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన శ్రీకాంత్ తరచూ భార్యతో గొడవ పడుతుండటంతో మూడేళ్ల క్రితమే భర్తను వదిలి వెళ్లడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. శ్రీకాంత్‌రెడ్డి మద్యం మత్తులో తల్లితో గొడవ పడుతుండటంతో భరించలేని తల్లి వెంకటమ్మ రెండు రోజుల క్రితం నాగరంలోని కూతురు ఇంటికి వెళ్లింది. మూడు రోజులుగా ఇంట్లో ఎవరులేక పోవడంతో ఇంటిని శుభ్రం చేసేందుకు ఆదివారం ఉదయం నాగార్జుననగర్‌కాలనీలోని తన ఇంటికి వచ్చింది. తాను ఉండే ఇంటిని శుభ్రం చేసి కొడుకు గది వద్దకు వెళ్లి డోర్ కొట్టింది. ఎంతకు పలకకపోవడంతో డోర్ తెరుచుకొని లోనికి వెళ్లింది. డైనింగ్ టేబుల్ వద్ద కొడుకు పడిపోయి ఉన్నాడు. ఆందోళన చెందిన ఆమె చుట్టు పక్కల వారిని పిలిచింది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ లభించిన ఆధారాలను సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతిగా మద్యం తాగడం వల్లే మృతిచెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధాంరించారు. తండ్రి ఆత్మహత్య.. కొడుకు అనుమానాస్పద మృతి శ్రీకాంత్‌రెడ్డి తండ్రి ధర్మారెడ్డి మాజీ తహసీల్దార్ నాగరాజు అవినీతికి పాల్పడ్డ కేసులో మూడు నెలల పాటుగా జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలై మరుసటి రోజే వాసవిశివనగర్ కాలనీలోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తాజాగా ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదీ వివాదం.. భూరికార్డులు మార్చేందుకు రూ.2 కోట్లు లంచం అడిగి, ముందస్తుగా రూ.1.10 కోట్లు తీసుకుంటూ 2020, ఆగస్టు 14న కీసర అప్పటి తహసీల్దార్ నాగరాజుతోపాటు రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్, వీఆర్ఏ సాయిరాజు ఏసీబీకి పట్టుబడ్డారు. నాగరాజు వ్యవహారాలపై ఏసీబీ ఆరాతీయగా, ధర్మారెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు మరో ఉదంతం వెలుగుచూసింది. రాంపల్లి దయారాలోని 93 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారన్న ఆరోపణలతో ధర్మారెడ్డి, అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, ఇద్దరు రియల్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి నకిలీ పత్రాలు, అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించినట్టు గుర్తించిన ఏసీబీ.. నాగరాజుపై రెండో కేసును నమోదు చేసింది. ఏసీబీ కస్టడీలో ఉండగానే అక్టోబర్ 14న చంచల్‌గూడ జైలులో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మారెడ్డికి వయసు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలై మరుసటి రోజే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు నిందితులు బలవన్మరణాలకు పాల్పడడంతో అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా మరో నిందితుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. -
ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య.. అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: కీసర ఎమ్మార్వో నాగరాజు మృతి కేసులో అనుమానాలు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నాగరాజుది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. జైల్లో ఆత్మహత్య ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటుంటే జైలు సిబ్బంది ఏం చేశారు? జైలు సిబ్బందిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు అని సందేశాలు వ్యక్తం చేశారు. ఏసీబీ కేసుల్లో వాస్తవం లేదని తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. ఇప్పటికే సీసీ ఫుటేజీ ఏసీబీ కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ విషయంలో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తామని నాగరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే నాగరాజు కుటుంబ సభ్యులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. చదవండి: నాగరాజుది హత్యే.. -
రిటైర్డ్ అడిషనల్ ఎస్పీని ముప్పుతిప్పలు పెట్టిన నాగరాజు
సాక్షి, హైదరాబాద్ : కోటి 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కీసర తహసీల్దార్ నాగరాజు అక్రమాలు తవ్వినకొద్ది బయటకు వస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సామాన్య ప్రజలనే కాకుండా పోలీసు అధికారులను సైతం లంచం డిమాండ్ చేసి ముప్పు తిప్పలు పెట్టారు. ఆయన బాధితుల్లో తాను ఒకడినని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సురేందర్ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. లీగల్‌గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడని వాపోయారు. (చదవండి : 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) ‘నేను రిటైర్మెంట్ అయిన తర్వాత 2018లో సర్వేనెంబర్ 614లో నాలుగు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాను. లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడు. గతంలో నాగరాజుపై చీఫ్ సెక్రెటరీకి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీవో కు ఫిర్యాదు చేశాను. అధికారులను మభ్యపెడుతు తన పదవిని కాపాడుకుంటున్నాడు. ఒక పోలీస్ అధికారిగా ఉన్న నన్నే లంచం డిమాండ్ చేశాడంటే.. ఇక సామాన్య రైతుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కుమ్మక్కై దందాలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకుండా ఒక్క పని కూడా చేయడు.న్యాయస్థానం కూడా నాగరాజు వ్యవహారంలో సీరియస్ అయింది. ఇలాంటి వ్యక్తి ని కఠినంగా శిక్షించాలి’అని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. (చదవండి : నాగరాజు ఇంటిలో కొనసాగుతున్న సోదాలు) -
‘చెడ్డీ గ్యాంగ్’ చిక్కింది!
సాక్షి, హైదరాబాద్: నగర శివారుల్లో వరుస చోరీలతో కలకలం సృష్టించిన కరడుగట్టిన అంతర్రాష్ట్ర చెడ్డీ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని దహోడా జిల్లా సహోదా గ్రామానికి చెందిన అన్నదమ్ములు పారమౌర్ కిషన్ బాధ్య, పారమౌర్ రావోజీ బాధ్య, వీరి బంధువు గనవ భరత్ సింగ్‌ను ఆదిభట్ల ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని చెట్లపొదల్లో తచ్చాడుతుండగా రాచకొండ ఎస్వోటీ, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.3,50,000ల విలువచేసే 10 తులాల బం గారం, కిలో వెండి ఆభరణాలు, రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ సుధీర్‌బాబు, క్రైమ్స్ డీసీపీ నాగరాజుతో కలసి కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు తెలిపారు. సహోదా గ్రామంలో దినసరి కూలీలుగా పనిచేసుకునే కిషన్, రావోజీ, భరత్ సింగ్‌తో పాటు మరో 8 మందిని అదే గ్రామానికి చెందిన రామ్‌జీ.. సూరత్‌లో పని కోసం తీసుకెళ్లి చోరీల బాట పట్టించాడు. అలా నేరాలబాట పట్టిన వీరు 2010లో ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారిం చారు. 2012లో బోయిన్పల్లి పోలీసులు ఈ గ్యాంగ్ లో ఒకరిని, 2014లో మేడిపల్లి పోలీసులు మరికొంత మందిని అరెస్టు చేశారు. 2017లో మీర్‌పేట ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసులో దినేశ్ అరెస్టు కాగానే అతడి వేలిమద్రలు, వ్యక్తిగత వివరాలు తీసుకున్నారు. దినేశ్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం మీర్‌పేట ఠాణా పరిధిలోని బడంగ్‌పేటలో, అగ్రికల్చర్ కాలనీలో చెడ్డీ గ్యాంగ్ చోరీలతో కలకలం సృష్టించింది. మియాపూర్, ఘట్కేసర్ ప్రాంతాల్లోనూ కలకలం సృష్టించింది. దీంతో వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయా చోరీల్లో పోలీసులకు లభించిన వేలిముద్రలతో చెడ్డీ గ్యాంగ్ దగ్గర తీసుకున్నవాటితో సరిపోయాయి. దీంతో ఇది చెడ్డీ గ్యాంగ్ పనే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దినేశ్ నుంచి సేకరించిన వివరాల ప్రకారం సహోదా గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వారికి నేరచరిత్ర లేదు: దినేశ్ గురించి అక్కడ పోలీసులను వాకబు చేయగా నేరచరిత్ర ఏమీ లేదని తేలింది. ఆ గ్రామంలో 35 కుటుంబాలు ఉండగా అంతా బంధువులే కావడం విశేషం. స్థానిక పోలీసుల సహకారంతో ఆ ఊరులోకి వెళ్లిన రాచకొండ పోలీసులకు చిత్రవిచిత్రాలు కనిపించాయి. ప్రతి ఇంటి ముందు ముళ్ల పొద ఉంది. పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు అనేక మార్గాలు ఉండటం కనిపించింది. దినేశ్ కోసం వచ్చారని తెలుసుకున్న ఆ గ్రామవాసులు మిగతావారిని కూడా అప్రమత్తం చేయడంతో తప్పించుకున్నారు. ఇలా నెలరోజుల పాటు అక్కడే ఉండి వారిని పట్టుకునే అవకాశం రాలేదు. కానీ ఆ గ్యాంగ్ సమాచారం తెలుసుకోగలిగారు. ఆదిభట్లలో అరెస్టు: పోలీసులు సహోదాలోనే ఉన్నట్లుగా భావించిన ఈ గ్యాంగ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆదిభట్ల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో తచ్చాడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురిని పట్టుకున్నారు. అనుమానం వచ్చి వారిని మీర్‌పేట ఠాణాకు తరలించారు. గతంలో సేకరించిన వేలిముద్రలతో ఇద్దరివి సరిపోలడంతో వారు చెడ్డీ గ్యాంగ్‌గా తేలింది. దినేశ్, సురేశ్, కిషన్‌లు ముఠాగా మారి చోరీలు చేస్తున్నారని తేలింది. ఇక్కడ చోరీలతో సొంతూర్లో దీపావళి.. ‘చోరీలు చేసేందుకు రైలు మార్గం ద్వారా వచ్చే వీరు 4 ప్రాంతాలను ఎంచుకొని ఒక్కో స్టేషన్లో దిగిపోతారు. ఆయా స్టేషన్లలో ఇద్దరు ఉంటే మరో ఇద్దరు వెళ్లి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి వచ్చేవారు. శివారు ప్రాంతాల్లో ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకునేవారు. పగటి వేళ అడవి లాంటి ప్రాంతంలో ఉండి రాత్రి కాగానే ప్యాంట్, షర్ట్ విప్పేసి చెడ్డీ వేసుకొని నడుంకు షర్ట్ చుట్టుకొని చెప్పులు చేతపట్టుకొని చోరీకి బయలుదేరతారు. శరీరానికి నూనెను రాసుకుంటారు. గోడలు ఎక్కి దూకే సందర్భంలో ప్యాంట్ వేసుకొని ఉంటే కిందపడే అవకాశముంటుందని చెడ్డీలు ధరిస్తారు. తాళాలు పగులగొట్టడంలో అనుభవమున్న ఇద్దరు ఆ పనిచూస్తారు. చోరీలు చేశాక ఒక ప్రాంతంలో కలుసుకుంటారు. చందానగర్ ప్రాంతంలో జరిగిన చోరీని దినేశ్ గ్యాంగ్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీపావళికి 2 నెలల ముందు, సంక్రాంతికి హైదరాబాద్ వచ్చి చోరీలు చేస్తుంటామని విచారణలో తెలిపారు. చోరీ చేసిన ఆభరణాలను గుజరాత్లో అమ్మి సొంతూరులో దీపావళి చేసుకుంటామన్నారు. వీరి అరెస్టుతో రాచకొండ కమిషనరేట్‌లో 8 చోరీలు, సైబరాబాద్ పరిధిలో 4, హైదరాబాద్ పరిధిలో ఒకటి, ఏపీలోని 15 కేసులు కొలిక్కివచ్చాయి. -
ఇద్దరు పెళ్లి కుమారులు పరార్!
మెట్పల్లి: మరో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా యువకులు పరారయ్యారు. మెట్పల్లిలో నాగరాజు, సుల్తానాబాద్‌లో కుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. మెట్పల్లి మండలం ఆత్మకూర్‌కు చెందిన కోల నాగరాజు(24)కు అదే గ్రామ యువతితో ఈనెల 27న వివాహం చేయ నిశ్చయించారు. నాగరాజు శనివారం మెట్‌పల్లికి పోతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలు చోట్ల వెదికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుల్తానాబాద్‌లో మరొకరు సుల్తానాబాద్: మండలకేంద్రంలోని గౌడవీధిలో ఉంటున్న గాజుల కుమార్(30) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై రాజు తెలిపారు. ఇంట్లో నుంచి ఈనెల 24న గేదెలను గడ్డి మేపేందుకు తీసుకొని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లల్లో వెదికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి భూదమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన యువతితో ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. కుమార్‌కు రెండో వివాహమైనప్పటికీ వివాహ సమయానికి కనిపించకుండా పోవడంతో చర్చనీయాంశమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉసురు తీసిన అప్పులు
పెద్దశంకరంపేట, పాపన్నపేట: అప్పులు ఉసురుతీశాయి. ఆర్థిక ఇబ్బందులు తాళలేక జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా మరొకరి గుండె ఆగింది. పెద్దశంకరంపేట మండలం మాడ్చెట్‌పల్లి శనివారం రాత్రి, పాపన్న పేట మండలం గాంధారిపల్లిలో ఆదివారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే..మాడ్చెట్‌పల్లి గ్రామానికి చెందిన తలారి లక్ష్మయ్య, సత్యమ్మల కుమారుడు నాగరాజు (30) హైద్రాబాద్‌లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. ఆధార్ కార్డు తీసుకోవడానికి శుక్రవారం గ్రామానికి వ చ్చాడు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలంగా సతమతమవుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పో సుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుప్రక్కల వారు, కుటుంబీకులు వచ్చి మంటలు ఆర్పేప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శరీరం ఎక్కువశాతం కాలిపోవడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడికి భా ర్య ప్రమీల, ఇద్దరు కుమారులు ఉన్నారు. సం ఘటన స్థలంలో కుటుంబీకుల రోదనలు అం దర్నీ కన్నీరు పెట్టించాయి. లక్ష్మయ్యకు ముగ్గు రు కుమారులు. కాగా ఒకరు అనారోగ్యంతో గతంలోనే చనిపోయాడు. మృతుడి కుటుంబా న్ని టీఆర్ఎస్ ఖేడ్ ఇన్చార్జ్ భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు విజయరామరాజు పరామార్శించి అర్థిక సాయం అందజేశారు. గాంధారిపల్లిలో.. పాపన్నపేట మండలం గాంధారిపల్లి గ్రామానికి చె ందిన టేక్మాల్ రాములు(40) అనే వికలాంగుడు గతంలో ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే ఆశతో అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు మంజూరు కాకపోవడంతోపాటు అప్పులు పెరిగాయి. రేషన్‌కార్డును సైతం అధికారులు రద్దు చేశారని మృతుని బార్య అనిత తెలిపింది. దీంతో రాములు గత కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఆదివారంతెల్లవారుజామున గుండెపోటుకు గురై రాములు మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి కుమారుడు ఉపి, కూతురు ఉదయ ఉన్నారు. -
యువకుడి దారుణ హత్య
నిజాంసాగర్ : మండలంలోని నర్వ గ్రామానికి చెందిన పెంటబోయిన నాగరాజు (27) అనే యువకుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబీకుల ప్రోద్బలంతో స్నేహితులు ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ద్వారా తెలిసింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నర్వ గ్రామానికి చెందిన పెంటబోయిన ఎల్లవ్వ మనుమడు నాగరాజు వ్యవసాయ పనులు చేసుకుంటూ మద్యానికి బానిసగా మారాడు. చిన్ననాటి నుంచి మద్యం సేవించడంతో కుటుంబంలో తరుచూ తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. చెడువ్యసనాలకు బానిసగా మారిన నాగరాజు పరివర్తనలో మార్పురాకపోవడంతో ఐదేళ్ల కిందట ఓ యువతితో పెళ్లి జరిపించారు. అయినా నాగరాజులో మార్పు కన్పించలేదు. రోజూ మద్యం సేవించి వచ్చి భార్యను, కుటుంబీకులను కొట్టేవాడు. భర్త చిత్రహింసలను భరించలేక మొదటి భార్య విడాకులు తీసుకుంది. ప్రతిరోజూ మద్యం సేవించడంతో పాటు పక్కగ్రామాల్లో పేకాట ఆడుతూ ఆస్తిని గుల్ల చేశాడు. కాగా మూడేళ్ల కిందట మమహమ్మద్నగర్కు చెందిన మమతతో రెండో పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి కొద్దిరోజుల పాటు నాగరాజు లో మార్పుకన్పించింది. వీరికి ఏడాదిన్నర కింద ట బాలుడు పుట్టాడు. కొద్దిరోజులకు మళ్లీ మ ద్యానికి బానిసై భార్య తో పాటు కుటుంబీకుల తో గొడవపడుతూ దాడి చేసేవాడు. ఈ విషయ మై రెండు సార్లు నాగరాజుపై కుటుంబ సభ్యులు పోలీ స్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కొన్నేళ్ల నుంచి చిత్రహింసలను భరిస్తున్న కుటుంబీకులు నాగరాజును హత మార్చడానికి వారం రోజుల కిందట పథకం పన్నారు. రోజులాగే మద్యం సేవించి వచ్చిన నాగరాజు కుటుం బీకులతో గొడవపడ్డాడు. ఇదే అదునుగా భావించినకు టుంబీకులు నాగరాజు హత్యకోసం ప్రయత్నాలు చేశా రు. నాగరాజు స్నేహితులైన ఇదే గ్రామానికి చెందిన బోండ్ల మచ్చెందర్, రుద్ర రాంచందర్‌లను కుటుం బీకులు ఇంటికి పిలిచారు. చిత్తుగా మద్యం తాగి ఉన్న నాగరాజును హతమార్చాలని వారిని కోరారు. కుటుం బీకుల సహకారంతో ఇంట్లోనే నాగరాజు గొంతు, మర్మాంగాలను కుటుంబీకులు, స్నేహితులు నులిమి దాడి చేసి హత్య చేశారు. హత్య విషయం బయటకు పొక్కకుండా నాగరాజు మృతదేహాన్ని ఇంటి కొద్దిదూరంలో ఉన్న చింతచెట్టు కిందపడేశారు. వేకువజామున నిద్రలేచిన కుటుంబీకులు చింతచెట్టుకింద నాగరాజు హత్యకు గురైనట్లు గ్రామస్తులను నమ్మబలికారు. చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహన్ని పరిశీలించి హత్యగా భావించారు. ఈ విషయమై స్థానికులు కుటుంబీకులను ప్రశ్నించగా తమకు ఎవరిపైనా అనుమానాలు లేవని, పోలీసులకు ఫిర్యాదు వద్దన్నారు. చివరకు బంధువుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్సై అంతిరెడ్డి సంఘటనస్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. విషయాన్ని బాన్సువాడ రూరల్ సీఐ రమణారెడ్డికి చేరవేశారు. దీంతో సీఐ అక్కడికి చేరుకొని జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. అప్పటికే కుటుంబీకులను అనుమానించగా హత్య నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. డాగ్ స్వ్కాడ్ ఘటన స్థలం నుంచి ఇంట్లోకి వెళ్లి కుటుంబీకులను పట్టుకుంది. ఈ మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మమతతో పాటు చిన్నమ్మ మంజుల, అమ్మమ్మ ఎల్లవ్వ, స్నేహితులు రాంచందర్, మచ్చెందర్లపై కేసునమోదు చేసినట్లు ఎస్సై అంతిరెడ్డి తెలిపారు. హంతకులు పరారిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
నిర్లక్ష్యం’ ఖరీదు నిండు ప్రాణం
బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణం బలి తీసుకుంది. కళాశాలలో ఈ-4 చదువుతున్న నల్గొండ జిల్లా కనగరి మండలం గౌరారం గ్రామానికి చెందిన నాగరాజు ఆదివారం ఉదయం ఏడు గంటలకు బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీ అధికారులకు సమాచారం అందించారు. మరికొందరు ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు, సిబ్బంది, అంబులెన్సు అందుబాటులో లేక విద్యార్థులు వెనుదిరిగారు. ఆలస్యంగా స్పందించిన అధికారులు 40 నిమిషాల తర్వాత ఓమిని వ్యానును పంపించారు. వ్యానులో తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగరాజును ఆస్పత్రికి తరలించే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది తమకు అధికారులు చెప్పలేదని నిలువరించారు. అధికారుల సమాచారం వచ్చాకే బయటకు తీసుకువెళ్లాలని తేల్చి చెప్పారు. ఎట్టకేలకు అధికారులు స్పందించడంతో విద్యార్థిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో వైద్య సేవలు అందిస్తున్న క్రమంలోనే నాగరాజు ప్రాణాలు వదిలాడు. అధికారుల నిర్లక్ష్యం తమతోపాటు చదువుకునే విద్యార్థి నాగరాజును రక్షించుకోలేక పోయామని అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ట్రిపుల్ ఐటీలో చదివుతున్న ఆరు వేల మంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. భైంసా-బాసర ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు రోడ్డుపైనే ఆందోళన నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ కళాశాల డెరైక్టర్ రాజేంద్రసాహూ, ఓఎస్డీ నారాయణ, సీఎస్‌వో వజీరోద్ధిన్, సెక్యూరిటీ సూపర్వైజర్ స్వామి, సాయినాథ్, శివప్రసాద్‌లను తక్షణమే విధుల్లో నుంచి తొలగించాలని విద్యార్థులు పట్టుబట్టారు. భైంసా డీఎస్పీ గిరిధర్ ట్రిపుల్ ఐటీకి చేరుకుని కళాశాల అధికారులను పిలిపించి విద్యార్థుల డిమాండ్లపై చర్చించారు. కళాశాల అధికారుల దాటవేత ధోరణితో మరోసారి విద్యార్థులు మధ్యాహ్నం రెండోసారి రోడ్డుపై బైఠాయించారు. అధికారులను తొలగించనిది ఆందోళన విరమించమని రాత్రి వరకు కూడా రోడ్డుపైనే బైఠాయించారు. దిగొచ్చిన అధికారులు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తుండటం, రాత్రి వరకు కూడా విరమించకపోవడంతో ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ సోమయ్య బాసరకు వచ్చారు. విద్యార్థుల డిమాండ్లపై వారితో చర్చించారు. ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ రాజేంద్రసాహూ, ఓఎస్డీ నారాయణ, డీఈ రాజేశ్వర్, సీఎస్‌వో వాజొద్దీన్, కార్యాలయ అధికారి బద్రిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పది గంటలపాటు ఆందోళన చేసిన విద్యార్థులు రిజిస్ట్రార్ సోమయ్య నచ్చజెప్పడంతో శాంతించారు. గతంలో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్నా సస్పెండ్ చేసి మళ్లీ కొనసాగించారని విద్యార్థులు పేర్కొన్నారు. సస్పెండ్ అయిన అధికారులు మళ్లీ కొనసాగితే ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని విద్యార్థులు హెచ్చరించారు. సమస్యలతో సహవాసం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. నిద్రలేవగానే నీటి కష్టాలతో వారి అవస్థలు మొదలవుతాయి. స్నానాలు చేయకుండానే విద్యార్థులు తరగతి గదులకు వెళ్తున్నారు. ఆడ పిల్లలయితే నీటి కోసం వేకువజామునే నిద్రలేచి బారులు తీరాల్సిన పరిస్థితి. ఇక మెస్‌కు వెళ్తె అక్కడ సరైన భోజన సౌకర్యం ఉండదు. ఈ విషయం తెలిసిన ట్రిపుల్ ఐటీ అధికారులు స్పందించరు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తున్నారు. అంతా తామై వ్యవహరిస్తున్న ఇక్కడి అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధులకు విద్యార్థులు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లో కరెంటు సరఫరాలోనూ తీవ్ర అంతరాయం తప్పదు. చీకటి గదుల్లో చదవలేక ఆరు బయట మహారాష్ట్ర ప్రాంతంలోని ఆల్కాహాల్ ఫ్యాక్టరీ దుర్గంధం భరించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక్కడి వాతావరణంతో విద్యార్థులు అనారోగ్యం భారిన పడుతున్నారు. సౌకర్యాలు లేకపోవడం అనారోగ్య సమస్యలతో బాధపడడంతో విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేక పోతున్నారు. ఫలితంగా కళాశాలలో చదివే విద్యార్థులు మనస్తాపానికి గురై ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కళాశాలను ప్రారంభం నుంచి ఇప్పటివరకు నడిపిస్తున్న అధికారులను తప్పిస్తేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటూ విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నాం.. - నాగరాజు పింగళి, బాసర ఎస్సై ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నాం. ఉద్యోగం రాకపోవడమా, అనారోగ్య కారణమా మరే ఇతర కారణాలు ఉన్నాయో అనే కోణంలోనూ పరిశీలిస్తాం. నాగరాజు ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నాం. -
మూషికం కలుగులో రూ.30 వేలు...
ఒక ఎలుక రూ.30 వేలు దా(దో)చి ఔరా మూషికం అనిపించుకుంది. ఈ విచిత్రం నెల్లూరు జిల్లా తూపిలిపాళెంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నాగరాజుకి తన చిల్లర దుకాణంలో రోజూ నోట్ల లెక్క తప్పుతున్నా, ఏమయ్యాయో అర్థమయ్యేది కాదు. సోమవారం ఉదయం దుకాణం తెరవగానే ఎలుక చనిపోయిన దుర్వాసన వచ్చింది. దీంతో వెతుకులాడగా చనిపోయిన ఎలుక, దాని కలుగు వద్ద కరెన్సీ నోట్లు కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కలుగును తీయగా దాదాపు రూ.30వేలు దొరికాయి. ఇందులో రూ.5 వేల నోట్లు ఉపయోగం లేకుండా ముక్కలై ఉన్నాయి. దొరికిందే చాలనుకుని నాగరాజు సంబరపడ్డాడు.