ఉసురు తీసిన అప్పులు
పెద్దశంకరంపేట, పాపన్నపేట: అప్పులు ఉసురుతీశాయి. ఆర్థిక ఇబ్బందులు తాళలేక జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా మరొకరి గుండె ఆగింది. పెద్దశంకరంపేట మండలం మాడ్చెట్‌పల్లి శనివారం రాత్రి, పాపన్న పేట మండలం గాంధారిపల్లిలో ఆదివారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే..మాడ్చెట్‌పల్లి గ్రామానికి చెందిన తలారి లక్ష్మయ్య, సత్యమ్మల కుమారుడు నాగరాజు (30) హైద్రాబాద్‌లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గ్రామంలో రెండెకరాల పొలం ఉంది.
ఆధార్ కార్డు తీసుకోవడానికి శుక్రవారం గ్రామానికి వ చ్చాడు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలంగా సతమతమవుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పో సుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుప్రక్కల వారు, కుటుంబీకులు వచ్చి మంటలు ఆర్పేప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శరీరం ఎక్కువశాతం కాలిపోవడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడికి భా ర్య ప్రమీల, ఇద్దరు కుమారులు ఉన్నారు. సం ఘటన స్థలంలో కుటుంబీకుల రోదనలు అం దర్నీ కన్నీరు పెట్టించాయి. లక్ష్మయ్యకు ముగ్గు రు కుమారులు. కాగా ఒకరు అనారోగ్యంతో గతంలోనే చనిపోయాడు. మృతుడి కుటుంబా న్ని టీఆర్‌ఎస్ ఖేడ్ ఇన్‌చార్జ్ భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు విజయరామరాజు పరామార్శించి అర్థిక సాయం అందజేశారు.
గాంధారిపల్లిలో..
పాపన్నపేట మండలం గాంధారిపల్లి గ్రామానికి చె ందిన టేక్మాల్ రాములు(40) అనే వికలాంగుడు గతంలో ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే ఆశతో అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు మంజూరు కాకపోవడంతోపాటు అప్పులు పెరిగాయి. రేషన్‌కార్డును సైతం అధికారులు రద్దు చేశారని మృతుని బార్య అనిత తెలిపింది. దీంతో రాములు గత కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఆదివారంతెల్లవారుజామున గుండెపోటుకు గురై రాములు మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి కుమారుడు ఉపి, కూతురు ఉదయ ఉన్నారు.