ఇద్దరు పెళ్లి కుమారులు పరార్! | two grooms escape from wedding | Sakshi

పెళ్లికి ముందే పరార్‌ !

Nov 27 2017 9:38 AM | Updated on Nov 27 2017 9:38 AM

two grooms escape from wedding - Sakshi

మెట్‌పల్లి: మరో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా యువకులు పరారయ్యారు. మెట్‌పల్లిలో నాగరాజు, సుల్తానాబాద్‌లో కుమార్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌కు చెందిన కోల నాగరాజు(24)కు అదే గ్రామ యువతితో ఈనెల 27న వివాహం చేయ నిశ్చయించారు. నాగరాజు శనివారం మెట్‌పల్లికి పోతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలు చోట్ల వెదికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

సుల్తానాబాద్‌లో మరొకరు
సుల్తానాబాద్‌:   మండలకేంద్రంలోని గౌడవీధిలో ఉంటున్న గాజుల కుమార్‌(30) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై రాజు తెలిపారు. ఇంట్లో నుంచి ఈనెల 24న గేదెలను గడ్డి మేపేందుకు తీసుకొని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లల్లో వెదికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి భూదమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన యువతితో ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది.  కుమార్‌కు రెండో వివాహమైనప్పటికీ వివాహ సమయానికి కనిపించకుండా పోవడంతో చర్చనీయాంశమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement