వరుడు పరారీ, పీటల మీద ఆగిన పెళ్లి | bride groom jump and stop the marriage | Sakshi
Sakshi News home page

వరుడు పరారీ, పీటల మీద ఆగిన పెళ్లి

Published Fri, Apr 10 2015 11:39 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

వరుడు పరారీ, పీటల మీద ఆగిన పెళ్లి - Sakshi

వరుడు పరారీ, పీటల మీద ఆగిన పెళ్లి

నిజామాబాద్ : మరికాసేపట్లో పెళ్లి.. వధువరులిద్దరూ ఒకటి కాబోయే సమయం దగ్గర పడింది. హఠాత్తుగా వరుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన నిజామాబాద్ ఆర్యనగర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. జకరంపల్లి మండలానికి చెందిన సాయికుమార్‌కు ఆర్యనగర్‌కు చెందిన మీనాక్షితో ఆరు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. పెళ్లికుమార్తె బంధువులు సంప్రదాయం ప్రకారం ఎదుర్కోలు ద్వారా పెళ్లికొడుకును ఆర్యనగర్‌కు తీసుకువచ్చారు. అయితే పెళ్లి సమయానికి సాయికుమార్ కనిపించకుండా పోయారు.

ఒప్పుకున్న ప్రకారం రూ.లక్ష నగదుతో పాటు, బంగారం, బైక్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే పెళ్లికూతురు అందంగా లేదని.. అదనంగా మరో రూ.2 లక్షలు కట్నం ఇవ్వాలని వరుడి బంధువులు డిమాండ్ చేసినట్లు వారు తెలిపారు.  ఇదేంటని ప్రశ్నించినందుకు వరుడి బంధువులు తమపై దాడి చేశారని పెళ్లికూతురు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement