బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు
గుంటూరు క్రైం : అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశాల మేరకు బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది శుక్రవారం నగరంలో తనిఖీలు నిర్వహించారు. రంజాన్ మాసం ప్రారంభం కారణంగా మసీదులు వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వుండేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టారు. నగరంలోని అన్ని మసీదుల వద్ద ప్రాధాన్యతా ప్రకారం తనిఖీలు నిర్వహించేలా పోలీసులు ప్రణాళిక రూపొందించారు. ముస్లింలు అధికంగా వుండే ప్రాంతాల్లోని మసీదులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
దీనిలో భాగంగా పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని మసీదులను బాంబ్ డిస్పోజబుల్ టీం ఇన్‌చార్జి పి.మునియ్య నేతృత్వంలో సిబ్బంది ప్రత్యేక పరికరాల సహాయంతో మసీదులతోపాటు పరిసర ప్రాంతాలను సైతం తనిఖీచేశారు. డాగ్ స్క్వాడ్ సిబ్బంది పోలీస్ జాగిలం స్కూబీతో సోదాలు నిర్వహించారు.