శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు చెక్కు అందిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
రఘునాథపాలెం/సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడులో ఇటీవల గొత్తి కోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల పరిహారం చెక్కును ఆయన భార్య భాగ్యలక్ష్మి, కూతురు, కుమారుడికి ఖమ్మం జిల్లా ఈర్ల పూడిలో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సోమవారం అందజే శారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ చీఫ్ కన్జర్వే టర్ (సీసీఎఫ్) భీమా నాయక్, ఖమ్మం, భద్రా ద్రి జిల్లాల డీఎఫ్‌ఓలు సిద్దార్థ విక్రమ్ సింగ్, రంజిత్ నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ.. మంత్రి పువ్వా డ అజయ్‌కుమార్, శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సహాయం వెంటనే అందేలా చొర వ తీసుకున్నారని చెప్పారు. శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదు కుంటుందని భరోసా ఇచ్చారు.
ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూ డా త్వరగా వచ్చేలా చర్యలు చేపడతామని హా మీ ఇచ్చారు. అనంతరం ఎఫ్‌ఆర్వో చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఎంపీపీ గౌరి, తహసీల్దార్ నర్సింహారావు, ఎఫ్‌ఆర్‌ఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్ సూచనలకు అనుగుణంగా తమ రోజువారి విధుల్లో నిమగ్నమైనట్టు తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ జూనియర్ అటవీ అధికారుల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించాయి. శ్రీనివాసరావు హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాయి.
అలాగే విధి నిర్వహణలో ఉన్న అటవీ ఉద్యోగుల రక్షణకు ముందుకు వచ్చి, క్షేత్ర స్థాయిలో సహకరిస్తున్న పోలీస్ శాఖకు, డీజీపీకి కూడా ధన్యవాదాలు తెలిపాయి. గొత్తికోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు కుటుంబానికి ప్రకటించిన మిగతా హామీలను కూడా సకాలంలో నెరవేర్చి ఆ కుటుంబానికి ఊరట కలిగించాలని విజ్ఞప్తి చేశాయి. ఎఫ్‌ఆర్‌వో భార్యకు డిప్యూటీ తహసీల్దార్ హోదా ఉద్యోగంతో పాటు, ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరాయి. శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెక్కును అందించిన స్థానిక ప్రజా ప్రతినిధులు, అటవీ అధికారులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment