డబ్బుల కోసం సర్పంచ్‌ భర్త అపహరణ, దాడి | Sarpanch husband kidnapped in nizamabad | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసం సర్పంచ్‌ భర్త అపహరణ, దాడి

Published Wed, Oct 18 2017 11:50 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

Sarpanch husband kidnapped in nizamabad - Sakshi

నిజామాబాద్ : కాంట్రాక్ట్‌ పని చేసిన డబ్బులు చెల్లించడం లేదనే నేపంతో తోటి కాంట్రాక్టర్‌ను సినీ ఫక్కీలో అపహరించి బెదిరించి, కొట్టి వదిలిపెట్టిన ఘటన మంగళవారం మండలంలోని లోలం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. లోలం గ్రామ సర్పంచ్‌ లక్ష్మి భర్త శ్రీనివాస్‌ కొంత కాలంగా దమ్మన్నపేట్‌కు చెందిన మహేందర్‌ అనే కాంట్రాక్టర్‌తో కలిసి గ్రామంలో సీసీ రోడ్డు, జీపీ భవనం నిర్మాణ పనులు చేశారు. తనకు ఇవ్వాల్సిన వాటా డబ్బులు ఇవ్వటం లేదనే కోపంతో మంగళవారం తన అనుచరులతో మహేందర్‌ శ్రీనివాస్‌ను అపహరించి మూడు గంటల తర్వాత వదిలేశాడు. బాధితుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ డబ్బులు అధికంగా ఇవ్వాలని లేదంటే చంపుతానని మహేందర్‌ బెదిరించాడన్నారు. తన అనుచరులతో కలిసి కొట్టాడని తెలిపాడు. కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. ఈ మేరకు మహేందర్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement