Sarpanch husband
-
డబ్బుల కోసం సర్పంచ్ భర్త అపహరణ, దాడి
నిజామాబాద్ : కాంట్రాక్ట్ పని చేసిన డబ్బులు చెల్లించడం లేదనే నేపంతో తోటి కాంట్రాక్టర్‌ను సినీ ఫక్కీలో అపహరించి బెదిరించి, కొట్టి వదిలిపెట్టిన ఘటన మంగళవారం మండలంలోని లోలం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. లోలం గ్రామ సర్పంచ్ లక్ష్మి భర్త శ్రీనివాస్ కొంత కాలంగా దమ్మన్నపేట్‌కు చెందిన మహేందర్ అనే కాంట్రాక్టర్‌తో కలిసి గ్రామంలో సీసీ రోడ్డు, జీపీ భవనం నిర్మాణ పనులు చేశారు. తనకు ఇవ్వాల్సిన వాటా డబ్బులు ఇవ్వటం లేదనే కోపంతో మంగళవారం తన అనుచరులతో మహేందర్ శ్రీనివాస్‌ను అపహరించి మూడు గంటల తర్వాత వదిలేశాడు. బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ డబ్బులు అధికంగా ఇవ్వాలని లేదంటే చంపుతానని మహేందర్ బెదిరించాడన్నారు. తన అనుచరులతో కలిసి కొట్టాడని తెలిపాడు. కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. ఈ మేరకు మహేందర్‌పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
లైంగికదాడి కేసులో సర్పంచ్ భర్త అరెస్టు
ఇబ్రహీంపట్నం: లైంగిక దాడి కేసులో సర్పంచ్ భర్తను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ సురేందర్ తెలిపారు. ఆయన కథనం.. మండలంలోని వేములకుర్తిలో ఈ నెల ఒకటో తేదీ రాత్రి వేములకుర్తి సర్పంచ్ భర్త సున్నం సత్యం అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం సున్నం సత్యంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. -
బాలికపై సర్పంచ్ భర్త అత్యాచారయత్నం
-
సర్పంచ్ భర్త దారుణ హత్య
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం తిప్పాయిరెడ్డి పల్లిలో దారుణం జరిగింది. గ్రామ సర్పంచ్ అలివేలు భర్త తిరుపతయ్యను దుండగులు గత అర్థరాత్రి పొలం వద్ద హత్య చేశారు. గురువారం గ్రామస్తులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతయ్య హత్య నిరసిస్తూ గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. అందులోభాగంగా శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.