మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం తిప్పాయిరెడ్డి పల్లిలో దారుణం జరిగింది. గ్రామ సర్పంచ్ అలివేలు భర్త తిరుపతయ్యను దుండగులు గత అర్థరాత్రి పొలం వద్ద హత్య చేశారు. గురువారం గ్రామస్తులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతయ్య హత్య నిరసిస్తూ గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. అందులోభాగంగా శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.