ఇబ్రహీంపట్నం: లైంగిక దాడి కేసులో సర్పంచ్ భర్తను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ సురేందర్ తెలిపారు. ఆయన కథనం.. మండలంలోని వేములకుర్తిలో ఈ నెల ఒకటో తేదీ రాత్రి వేములకుర్తి సర్పంచ్ భర్త సున్నం సత్యం అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం సున్నం సత్యంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.