indalvaai
-
ఆరోగ్యం బాగుచేస్తానని..ఆభరణాలతో మాయం!
ఇందల్వాయి: ఆరోగ్యం బాగు చేస్తానని చెప్పిరెండున్నర తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని బాబా ఎత్తుకెళ్లిన సంఘటన ఇందల్వాయి మండలంలోని గన్నారంలో సోమవారం జరిగింది. ఎస్సై శివప్రసాద్తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారానికి చెందిన జాజుల లస్మయ్యకు గతేడాది యాక్సిడెంట్ కాగా ఆయన ఆరోగ్యం కుదుటపడడం లేదు. దీంతో ఓ బాబాని ఆశ్రయించగా, నీ ఆరోగ్యం బాగు చేస్తానని సోమవారం లస్మయ్య ఇంటికి బాబా వెళ్లాడు. ఇంట్లో పూజలు నిర్వహించి కుటుంబసభ్యుల ఆభరణాలు ఓ డబ్బాలో ఉంచి అందరినీ ఇంట్లోకి వెళ్లి రమ్మనికోరాడు. వీరు ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికే డబ్బాను మార్చేసి ఉడాయించాడు. దీంతో బాధితులు తాము మోసపోయామని గుర్తించి వెంటనే తమకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులను ఇళ్లలోకి రానివ్వద్దని, విలువైన వస్తువులు వారి చేతికి ఇవ్వవద్దని వారు పేర్కొన్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడిని దూరం పెట్టడంతో -
3 నెలల నిరీక్షణ: నేడు హైకోర్టులో విచారణ
డిచ్పల్లి: గల్ఫ్‌లో మరణించిన తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాలంటూ మృతుడి భార్య వేసిన పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు రానుంది. తమ మూడు నెలల నిరీక్షణకు సోమవారమైనా తెరపడుతుందని ఆ కుటుంబం ఆశిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లికి చెందిన వొంటరి నర్సారెడ్డి (49) ఉపాధి కోసం 2013 అక్టోబర్‌లో గల్ఫ్ వెళ్లారు. ఇరాక్ సరిహద్దులోని సకాకా పట్టణ మున్సిపాలిటీలో కార్మికుడిగా చేరారు. గత నవంబర్ 1న వాహనం ఢీకొట్టడంతో మృతి చెందారు. కరోనా, లాక్‌డౌన్‌తో విమానాల రాకపోకలు లేకపోవడం, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతో మృతదేహం ఇప్పటికీ స్వగ్రామానికి చేరుకోలేదు. దీంతో మృతుడి భార్య లక్ష్మి, తల్లి సత్తెవ్వ, కొడుకు సంతోష్‌రెడ్డి, కూతురు లావణ్య.. నర్సారెడ్డి మృతదేహాన్ని రప్పించడానికి చేయని ప్రయత్నం లేదు. చివరకు మానవ హక్కుల కార్యకర్త, హైకోర్టు న్యాయవాది పి.శశికిరణ్ సూచనతో భారత ప్రభుత్వ విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని ప్రతివాదులుగా చేస్తూ ఈనెల 4న హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. మృతుడి భార్య వొంటరి లక్ష్మి, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల పిటిషనర్లుగా ఉన్నారు. మృతదేహాన్ని వెంటనే భారత్‌కు చేరేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఇది నేడు విచారణకు రానుంది. .(చదవండి: అమ్మా ఇంటికొస్తున్నా.. బాధపడకు ) -
ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న గూడ్స్ లారీ వేగంగా వచ్చి క్యూలైన్లలో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు ఇందల్వాయి ఏఎస్ఐ బాల్సింగ్ తెలిపారు. వేగంగా వస్తున్న లారీ టోల్ ప్లాజా వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పినట్టు తెలుస్తోంది. గాయాలపాలైన వారిని టోల్ ప్లాజా అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (లవ్ ఫెయిల్: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య) -
అధికారం ఉంది.. తంతా!
ఇందల్వాయి(నిజామాబాద్ జిల్లా): అతడు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధి.. దాదాపు ఏడాది కింద ఓ మహిళకు తన ఇంటిని అమ్మాడు.. ఆమె డబ్బులన్నీ కట్టేసింది.. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది.. అయినా ఇంటిని స్వాధీనం చేయలేదు.. ఆ మహిళ ఇంటికెళ్లి నిలదీసినందుకు బలంగా కాలితో తన్నాడు! నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గౌరారానికి చెందిన ఇమ్మడి గోపి దాష్టీకమిదీ. 33 లక్షలకు అమ్మి.. 90 లక్షలు కావాలంటూ.. గోపి ధర్పల్లి ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఆయనకు ఇందల్వాయిలోని సర్వే నెం.1107లో 1,125 గజాల స్థలంలో రెండు పోర్షన్లతో కూడిన ఇల్లు (3–8–11/3) ఉంది. 11 నెలల క్రితం ఈ ఇంటితో సహా స్థలాన్ని గౌరారానికి చెందిన ఒడ్డె రాజవ్వ, గంగారాం దంపతులకు రూ.33.72 లక్షలకు విక్రయించాడు. విడతల వారీగా మొత్తం డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. నెల క్రితం ఇంటి చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు రాజవ్వ ఇసుక, ఇటుక తరలించగా.. గోపి అడ్డుకున్నాడు. రూ.90 లక్షలకు ఇంటిని అమ్మానని, మిగతా రూ.56 లక్షలు కడితేనే ఇంటిని స్వాధీనం చేస్తానని ఆయన అన్నట్లు రాజవ్వ, ఆమె కుమారుడు ఆరోపిస్తున్నారు. తాను మాజీ నక్సలైట్‌నని, తన చేతుల్లో అధికారం ఉందని, ఎవరూ ఏమి చేయలేరంటూ బెదిరించాడంటూ వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే సివిల్ తగాదాలు కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు సూచించడంతో బాధితులు స్థానిక ఎమ్మెల్యేకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులకు వద్దకు వెళ్లగా.. చివరకు ఎంపీపీపై బెదిరింపుల చట్టం కింద కేసు నమోదైంది. చెప్పుతో కొట్టడంతో.. రాజవ్వ కుటుంబీకులు ఆదివారం తమ కులస్తులతో కలిసి ఇందల్వాయిలోని తాము కొన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. తాళం పగలగొట్టి లోపన ఉన్న వస్తువులు, వంట సామగ్రిని బయటకు పడేసి, తమకు న్యాయం చేయాలంటూ ఇంటి మందు బైఠాయించారు. ఈ క్రమంలో ఎంపీపీ గోపికి, రాజవ్వ కుటుంబీకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తురాలైన రాజవ్వ గోపిని చెప్పుతో కొట్టింది. దీంతో అతడు రాజవ్వను కాలితో బలంగా తన్నాడు. కిందపడిన రాజవ్వ అస్వస్థతకు గురవడంతో చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థల వివాదంపై వివరణ కోరగా ఎంపీపీ స్పందించేందుకు నిరాకరించారు. మాకు ప్రాణ భయం ఉంది: రాజవ్వ తమ వద్ద గోపి రూ.33 లక్షలు తీసుకొని, ఇంటిని, స్థలాన్ని అప్పగించడం లేదని రాజవ్వ పేర్కొంది. ‘‘నేను మాజీ నక్సలైట్‌ను.. నా చేతిలో అధికారం ఉంది. మీరు నన్ను ఏమి చేయలేరు అని బెదిరిస్తున్నాడు. అతడి నుంచి మాకు ప్రాణ భయం ఉంది. నా భర్త దుబాయిలో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంటిని కొన్నా. అధికారులు, ప్రజాప్రతినిధులు మాకు న్యాయం చేయాలి’’అని ఆమె గోడు వెల్లబోసుకుంది. గోపిని అరెస్ట్ చేయాలి ఎంపీపీ దాడి విషయం తెలిసి వడ్డెర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకటి తదితరులు ఇందల్వాయికి చేరుకుని నిరసన తెలిపారు. ఎంపీపీపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గోపిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సోమవారం ప్రజాసంఘాలతో కలిసి ‘చలో ఇందల్వాయి’నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఇందల్వాయి బంద్‌కు పిలుపునిచ్చింది. -
ఎఫ్ఆర్వోపై చర్యలు తీసుకోవాలి
ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామ పరిధి స్టేషన్ తంగాలో గత శనివారం మేకలు మేపుకోవడానికి అడవిలోకి వెళ్తున్న గిరిజనుడిపై అడవులకు నిప్పు పెడుతున్నావని దాడి చేసి కొట్టిన ఇందల్వాయి రేంజ్ అధికారి సుభాష్ చంద్ర యాదవ్‌ను విధుల నుంచి తొలగించి అతనిపై ఎస్టీ ఎ స్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సోమ వారం గిరిజన నాయకులు అటవీశాఖ కార్యాల యం ఎదుట ఆందోళన చేశారు. ఉన్నత అధికా రి స్థాయిలో ఉండి విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం అన్యాయమని, అతనిపై జిల్లాస్థాయి అ ధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. న్యాయం జరగకపోతే ఆందోళనలు ఉ ధ్రుతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎఫ్ఆర్వోపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌కు, సీపీ కార్తికేయకు పిటిషన్ అందించారు. ఆందోళనలో ఆలిండియా బంజారా సేవా సం ఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి నాయక్, దళిత సంఘాల అధ్యక్షుడు సాయిలు, బంజారా సేవా సంఘం మండలాధ్యక్షుడు మోహన్ నాయక్,రమేష్ నాయక్ పాల్గొన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
నిజామాబాద్ నాగారం: ఇందల్వాయి మండలం గన్నారం పరిధిలో ఉన్న దాబాలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌శాఖ టాస్క్ఫోర్సు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. టాస్క్ఫోర్సు సిబ్బంది దాడుల్లో మంగళవారం గన్నారం పరిధిలో ఉన్న దాబా లో దేవితండాకు చెందిన వినోద్‌కుమార్ దాబాలో ఎండుగంజాయి ప్యాకెట్లను లారీ డ్రైవర్లకు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. దాబా యజమానులు అశోక్, వినోద్‌కుమార్‌పై కేసు నమోదుచేసి అరెస్టు చేశామన్నారు. 1.6 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.30 వేలు ఉంటుందన్నారు. టాస్క్ఫోర్సు ఎస్ఐ సింధూ, సిబ్బంది ఫయాజ్, మశ్చేందర్, అహ్మద్, రాజేశ్వర్, రమణ పాల్గొన్నారు. -
గో మాంసం తరలిస్తున్న వాహనాలు స్వాధీనం
నిజామాబాద్: గో మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సంఘటనలో పోలీసులు రెండు డీసీఎమ్‌లు, మూడు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి 44పై వెళ్తున్న ఈ వాహనాలను పోలీసులు ఇందల్వాయి గ్రామ సమీపంలో గుర్తించారు. ఈ మాంసాన్ని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఈ వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.