సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న గూడ్స్ లారీ వేగంగా వచ్చి క్యూలైన్లలో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు ఇందల్వాయి ఏఎస్‌ఐ బాల్‌సింగ్ తెలిపారు. వేగంగా వస్తున్న లారీ టోల్ ప్లాజా వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పినట్టు తెలుస్తోంది. గాయాలపాలైన వారిని టోల్ ప్లాజా అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (లవ్ ఫెయిల్: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment