నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రూనగర్‌లో లారీ ఢీకొని ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం 8.45 గంటలకు మదర్సాలో చదువుకునేందుకు సైకిల్‌పై సయ్యద్ గౌస్(13), ముజాయిద్(14)లు బయలు దేరగా, నిజామాబాద్ నుంచి బోధన వెళ్తున్న లారీ(ఏపీ 20 డీబీ 5688) ఢీ కొంది. దీంతో లారీ చక్రాల కింద నలిగిపోయిన వారి మృత దేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి.
ఇద్దరు చిన్నారులను చిదిమేసిన లారీ
Published Sat, Jul 26 2014 2:26 AM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM
Advertisement
Advertisement