Nehru Nagar
-
నెహ్రూనగర్‌లో విషాదఛాయలు
గుంటూరు ఈస్ట్: ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్లో సోమవారం రాత్రి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న బుంగా వెంకయ్య (47), భార్య రజిని (40), కుమార్తె సాయికృష్ణవేణి (22) మృతదేహాలను నెహ్రూనగర్‌కు మంగళవారం తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుకుమున్నాయి. అనంతరం కన్నీటి వీడ్కోలుతో అంత్యక్రియలు నిర్వహించారు. వెంకయ్య కుమారుడు సాయిగోపీనాథ్ తల్లిదండ్రులు, సోదరి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యాడు. అతనిని ఓదార్చడం ఎవరికి అలివికాలేదు. వెంకయ్య, భార్య రజిని అందరితో స్నేహంగా మెలిగేవారని, అటువంటివారు ఈవిధంగా చేసుకుని ఉండకూడదంటూ అక్కడికి వచ్చిన వారంతా కంటతడి పెట్టారు. లేళ్ల అప్పిరెడ్డి, రోశయ్యల పరామర్శ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి నెహ్రూనగర్‌లోని వెంకయ్య గృహం వద్దకు వెళ్లి భౌతికకాయాలను సందర్శించారు. సాయిగోపీనాథ్ను పరామర్శించి ఓదార్చారు. సాయిగోపినాథ్కు తాను అండగా ఉంటానని అప్పిరెడ్డి ధైర్యం చెప్పారు. విషయం తెలియగానే లేళ్ల అప్పిరెడ్డి మధిర వెళ్లి అక్కడ మృతదేహాలను తరలించేందుకు అవసరమైన చర్యలు దగ్గరుండి చూశారు. పోస్టుమార్టం అనంతరం గుంటూరు తరలించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. -
బీఎన్‌రెడ్డి నగర్లో ప్రమాదం..ఇద్దరి మృతి
హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చర్లపల్లి బీఎన్‌రెడ్డి నగర్లో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు నెహ్రూనగర్‌కు చెందిన చెరుకు రవి(50), రవళి(20)గా గుర్తించారు. మృతులిద్దరూ తండ్రీకూతుళ్లు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఇద్దరు చిన్నారులను చిదిమేసిన లారీ
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రూనగర్‌లో లారీ ఢీకొని ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం 8.45 గంటలకు మదర్సాలో చదువుకునేందుకు సైకిల్‌పై సయ్యద్ గౌస్(13), ముజాయిద్(14)లు బయలు దేరగా, నిజామాబాద్ నుంచి బోధన వెళ్తున్న లారీ(ఏపీ 20 డీబీ 5688) ఢీ కొంది. దీంతో లారీ చక్రాల కింద నలిగిపోయిన వారి మృత దేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి. -
ఉక్కరి బక్కిరి
అసాధారణ వాతావరణ పరిస్థితులతో జిల్లా వాసులు అల్లాడుతుంటే దానికి తోడు విద్యుత్ కోతలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గాలి పంఖాలు తిరగక ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు, ఆస్పత్రుల్లో రోగులు అవస్థలు పడుతున్నారు. పనివేళల్లో కరెంటు కోతలతో కార్మికులు ఉపాధి కోల్పోయి ఉసూరుమంటున్నారు. స్వశక్తితో చిన్న పరిశ్రమలు నెలకొల్పుకుని జీవనం సాగిస్తున్న యువత భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. గ్రామాల్లో తాగునీరు కూడా సక్రమంగా అందక ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. నెహ్రూనగర్(మాచర్ల)/రేపల్లె/మంగళగిరి రూరల్: పట్టణాల్లో ఆరు గంటల పాటు ఉదయం 9 గంటల నుంచి 12, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా నిలిచి పోతోంది. పల్లెల్లో 10 గంటల పాటు కోత విధిస్తున్నారు. ఇవి కాక అప్రకటిత కోతలు అదనం. వేసవి ఎండల తీవ్రత తగ్గి వర్షాలు కురిసే వరకు పరిస్థితి మారే అవకాశం కనిపించడం లేదని, వినియోగం తగ్గిన్నప్పటికీ బిల్లులు ఇంచుమించు అదే స్థాయిలో వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల అవస్థలు.. కరెంటు కోత ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు అవస్థలు పడుతున్నారు. ఉక్కపోతతో గుక్కపెట్టి ఏడుస్తున్న శిశువులను సముదాయించలేక బాలింతలు, వారి బంధువులు విసనకర్రలతో విసురుతూ గాలి అందించే ప్రయత్నం చేస్తున్నారు. మాచర్ల ప్రభుత్వాస్పత్రిలోని బాలింతల వార్డులో కనీసం జనరేటర్ కూడా పనిచేయడం లేదు. ఇక రాత్రి వేళల్లో రోగుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. మాచర్ల చుట్లు పక్కల ప్రాంతాల్లో ఇదే పెద్ద ఆసుపత్రి కావడంతో నిత్యం ఇక్కడికి 200 మంది రోగులు వస్తుంటారు. 30 పడకల ఈ వైద్యశాలలో రక్తనిధి కేంద్రానికి ఒక జనరేటర్ ఉండగా వైద్యులు దానికి ఆపరేషన్లు సమయంలో మాత్రమే వాడుకుంటున్నారు. కరెంటు లేక పోవటంతో ల్యాబ్, ఎక్స్‌రే యూనిట్లు సరిగ్గా పనిచేయడంలేదు. శుక్రవారం రాత్రి తలలకు గాయాలతో ఆస్పత్రికి వచ్చిన ఇద్దరికి టార్చిలైట్, సెల్‌ఫోన్ వెలుతురులో వైద్యులు కుట్లు వేశారు. కొవ్వొత్తి వెలుతురులోనే వైద్యురాలు పనులు చేసుకుంటూ కనపడ్డారు. కేటగిరి, అదనపు చార్జిల పేరుతో బిల్లుల మోత ఇప్పటికే గృహ వినియోగ విద్యుత్‌ను ఆరు కేటగిరీలుగా నిర్ణయించి బిల్లులు వసూలు చేస్తున్నారు. వాటికి అదనంగా కస్టమర్ చార్జీలు, విద్యుత్ సాధారణ సరఫరా చార్జి, ఇంధన సర్చార్జిలు వసూలు చేస్తున్నారు. ఈ బిల్లుల చెల్లింపు వినియోగదారులకు పెనుభారంగా మారింది. బిల్లులు చెల్లింపు కోసం మీ సేవ కార్యాలయాల్లోనూ సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. రూ.200 బిల్లుకు రూ.2, రూ.200 నుంచి రూ.1000 వరకు రూ.5 , రూ.1000 నుంచి రూ.2500 వరకు రూ.10, రూ.2500 నుంచి ఆపై బిల్లులకు రూ.25లు వినియోగదారులే చెల్లించాల్సి వస్తోంది. కుళాయిల నుంచి అందని నీరు.. ఎప్పుడంటే అప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంలో గ్రామాల్లోని రక్షిత మంచినీటి ట్యాంకులు కూడా నిండటం లేదు. దీంతో కుళాయిల ద్వారా ప్రజలకు తాగునీరు అందించేందుకు పంచాయతీ పాలకులు సతమతమవుతున్నారు. మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలోని పగటి వేళల్లో అధిక సమయం విద్యుత్ కోతలు విధిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. నాలుగైదు రోజులుగా పరిస్థితి మరింత దిగజారిపోయింది. అసలే మండుతున్న ఎండలు, ఆపై వడగాడ్పులతో హడలెత్తుతున్న ప్రజలు పది గంటలకు పైగా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ఇళ్లలో కనీసం ఫ్యాన్లు కూడా తిరగకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. తాగునీటితో ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా అయినా తాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కార్మికుల పరిస్థితి అగమ్యగోచరం.. కరెంటు కోతలతో ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పనివేళల్లో విద్యుత్ కోతలతో పనులు తగ్గిపోవటంతో పూటగడవటమే కష్టమవుతోంది. రేపల్లె విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో గృహ వినియోగానికి 41,082 కనెక్షన్లు, వ్యాపార సంస్థలకు 3,584, పరిశ్రమలకు 683, వ్యవసాయానికి 2,280, ప్రభుత్వ రంగసంస్థలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులకు 800ల కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెల రూ.1.3 కోట్లు రెవెన్యూ వసూలవుతోంది. విద్యుత్ కోతలు పెరిగిపోయినా రెవెన్యూ రాబడిలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. -
10 ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల సీజ్
దాచేపల్లి/ నెహ్రూనగర్ (మాచర్ల), న్యూస్‌లైన్ :నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆర్టీవో అధికారులు సీజ్ చేసిన సంఘటన శక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చోటుచేసుకుంది. ఆర్టీవో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు రవాణా శాఖ ఉప కమిషనర్ సుందర్ ఆధ్వర్యంలో తెనాలి, నరసరావుపేట, పిడుగురాళ్ల, మాచర్లకు చెందిన ఆర్టీఏ అధికారులు రాత్రి 9 నుంచి నుంచి దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ప్రైవేటు బస్సులను తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు, చీరాల, నరసరావుపేట నుంచి హైదరాబాద్ వె ళుతున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన ఏడు బస్సులు, యామిని, మేఘన, పవన్ ట్రావెల్స్‌కు చెందిన ఒక్కో బస్సును అధికారులు సీజ్ చేశారు. ఈ బస్సులను మాచర్ల ఆర్టీసీ గ్యారేజ్‌కు తరలించారు. అధికారులు ఆర్టీసీ డిపోమేనేజర్ జయశంకర్‌తో మాట్లాడి ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులను హైదరాబాద్ పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 ఆటో లు, ఒక లారీని కూడా సీజ్ చేశారు. తనిఖీల్లో ఎంవీఐలు సురేంద్రబాబు, సీహెచ్ రాంబాబు, రామచంద్రరావు, బాలమురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. అధికారుల తీరుపై ప్రయాణికుల నిరసన అర్ధరాత్రి మార్గమధ్యంలో ట్రావెల్స్ బస్సులను నిలిపివేయడంపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రావెల్స్ కార్యాలయాల వద్ద తగుచర్యలు తీసుకుంటే తాము ఇబ్బం దిపడేవారం కాదని వారు పేర్కొన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ ఎక్కడ వున్నాయో మీకు తెలియదా అంటూ అధికారుల తీరుపై ప్రయాణికులు నిరసన వ్యక్తంచేశారు. 264 మంది ప్రయాణికులను తరలించాం.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఒక హైటెక్, మూడు డీలక్స్, రెండు ఎక్స్‌ప్రెస్ బస్సులను ఏర్పాటుచేశామని మాచర్ల ఆర్టీసీ డీఎం జయశంకర్ తెలిపారు. 264మంది ప్రయాణికులను ఆరు బస్సుల్లో హైదరాబాద్‌కు పంపిం చినట్లు చెప్పారు. అనుమతుల్లేని బస్సుల్లో ప్రయాణించడం వల్ల ఇబ్బందులు వస్తాయని, అధికారులు నిరంతరం బస్సులను తనిఖీలు చేస్తారని తెలిపారు. సురక్షతమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని డీఎం కోరారు.