
ఇందల్వాయి: ఆరోగ్యం బాగు చేస్తానని చెప్పిరెండున్నర తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని బాబా ఎత్తుకెళ్లిన సంఘటన ఇందల్వాయి మండలంలోని గన్నారంలో సోమవారం జరిగింది. ఎస్సై శివప్రసాద్‌తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారానికి చెందిన జాజుల లస్మయ్యకు గతేడాది యాక్సిడెంట్ కాగా ఆయన ఆరోగ్యం కుదుటపడడం లేదు. దీంతో ఓ బాబాని ఆశ్రయించగా, నీ ఆరోగ్యం బాగు చేస్తానని సోమవారం లస్మయ్య ఇంటికి బాబా వెళ్లాడు. ఇంట్లో పూజలు నిర్వహించి కుటుంబసభ్యుల ఆభరణాలు ఓ డబ్బాలో ఉంచి అందరినీ ఇంట్లోకి వెళ్లి రమ్మనికోరాడు.
వీరు ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికే డబ్బాను మార్చేసి ఉడాయించాడు. దీంతో బాధితులు తాము మోసపోయామని గుర్తించి వెంటనే తమకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులను ఇళ్లలోకి రానివ్వద్దని, విలువైన వస్తువులు వారి చేతికి ఇవ్వవద్దని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment