
అట్లాంటా: తెలుగు జాతి, సంప్రదాయం ప్రపంచ పటంపై వెలుగుతోంది. తాజాగా అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో తెలుగుకు అద్భుతమైన గుర్తింపు లభించింది. అక్కడ అధికారికంగా తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జార్జియా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీ ఉగాది సందర్భంగా ఆ రోజును తెలుగు భాష, హెరిటేజ్ దినోత్సవంగా గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి.కెంప్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా తెలుగువారి సేవలను జార్జియా ప్రభుత్వం ప్రశంసించింది. దాంతోపాటు తెలుగు సంప్రదాయం, భాష బాగుంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా నార్త్ స్టెయిర్స్ ఆఫ్ జార్జియాలో జరిగిన ఉగాది వేడుకలో తెలుగు వారికి దానికి సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని అధికారులు అందించారు. జార్జియాలో తెలుగువారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వైద్యులు, ఇంజనీర్లుగా జార్జియా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. దాదాపు 500 మంది అక్కడి విద్యా రంగంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా ఉన్నారు. భారతదేశ సంప్రదాయాన్ని పరిరక్షిస్తూనే తెలుగు వారుగా గుర్తింపు పొందుతున్నారు. ఏప్రిల్ 12వ తేదీని తెలుగు భాష, హెరిటేజ్ దినోత్సవంగా గుర్తించి ఆ రోజు పాటలు, ఆటలు, సాహిత్య పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment