ఘనంగా ‘తామా’ బతుకమ్మ, దసరా వేడుకలు | TAMA Organised Bathukamma And Dasara Celebrations In Atlanta | Sakshi
Sakshi News home page

'తామా' ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు

Published Thu, Oct 3 2019 12:52 PM | Last Updated on Thu, Oct 3 2019 1:06 PM

TAMA Organised  Bathukamma And Dasara Celebrations In Atlanta - Sakshi

అట్లాంటా తెలుగు సంఘం 'తామా' ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా బతుకమ్మ, దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదావరి రెస్టారెంట్, మాగ్నమ్ ఓపస్ ఐటీ, డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అమెరిన్డ్ సోలుషన్స్, డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి సమర్పణలో సెప్టెంబర్ 28న ఈ వేడుకలు జరిగాయి. ఇందులో సుమారు 1700 మందికి పైగా మహిళలు, చిన్నారులు పాల్గొని రంగురంగుల బతుకమ్మలతో సందడి చేశారు.

ప్రపంచమంతా నివసిస్తున్న తెలుగువారు అత్యంత విశిష్టమైన బతుకమ్మ పండుగను భాద్రపదమాసములో జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఘనంగా జరిగే ఈ పండుగ గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోని అన్ని ప్రాంతాల తెలుగువారు నిర్వహిస్తున్నారు. ఏడు వరుసల్లో రంగు రంగుల పూలను పేర్చి, పసుపుతో గౌరమ్మను బతుకమ్మపైన పెట్టి రెండు అగరుబత్తులను వెలిగించి.. అన్ని బతుకమ్మలను ఒక ప్రాంగణంలో పెట్టి మహిళలు, ఆడపిల్లలు బతుకమ్మల చుట్టూ వృత్తాకారంలో చప్పట్లు కొడుతూ తిరుగుతూ ఆడిపాడారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఇండియా నుంచి ప్రముఖ జానపద గాయకులు డా. శ్రీనివాస లింగా హాజరయ్యారు. ఆయన తన పాటలతో అందరిని ఆకట్టుకున్నారు. లింగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలోని యాసలతో పాటలు వినిపించడం కార్యక్రమానికే ఒక వన్నె తెచ్చింది. దాదాపు 500 మహిళలు 100 పిల్లలు లింగా పాటలతో రెండు గంటలపాటు బతుకమ్మ ఉత్సాహంగా ఆడి అనంతరం నిమజ్జనం చేశారు.  

ఈ బతుకమ్మ పోటీల్లో న్యాయమూర్తులుగా వ్యవహిరంచిన స్నేహ బుక్కరాయసముద్రం, కనకలక్ష్మి చింతల, గీత వేదుల విజేతలను ప్రకటించారు. గెలచిన విజేతలకు రమేష్ అన్నాబత్తుల, విజు చిలువేరు బహుమతులను అందజేశారు. ప్రియా బలుసు ట్రివియా బహుమతులు, మహేష్ పవార్ కోలాటం కర్రలు స్పాన్సర్‌ చేశారు. బతుకమ్మ ఆటకు ముందు ప్రేక్షకులకు ఒక ప్రశ్నావళి నిర్వహించి.. అందులో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులను అందచేశారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న శశికళ పెనుమర్తి, నీలిమ గడ్డమణుగు, శాంతి మేడిచెర్ల, శ్రీదేవి దాడితోట, హేమశిల్ప ఉప్పల, శ్రీవల్లి శ్రీధర్‌, దాస్యం మాధవిలు పెద్దలను, చిన్నారులను ఆకట్టుకున్నారు.

బతుక్మ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంలో అన్ని శాఖల్లో అత్యంత మక్కువతో పనిచేసిన కార్యకర్తలు.. వెంకీ గద్దె, భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, ప్రియా బలుసు, సుబ్బారావు మద్దాళి, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, రవి కల్లి, బిల్హన్ ఆలపాటి, సురేష్ బండారు, రూపేంద్ర వేములపల్లి, భరత్ అవిర్నేని, శ్రీవల్లి శ్రీధర్, వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, విజు చిలువేరు, మహేష్ పవార్, రామ్ మద్ది, రామ్కిచౌడారపు, రమేష్ కోటికే, శ్రీనివాస్ కుక్కడపు, రమేష్ వెన్నెలకంటి, బాలనారాయణ మద్ద, శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి,  మురళి బొడ్డు, వెంకట్ మీసాల, విజయ్ రావిళ్ల, సురేష్ దూలిపుడి, మోహన్ ఈదర, శ్రీనివాస్ గుంటక, సుధాకర్ బొర్రా, యశ్వంత్ జొన్నలగడ్డ, విజయ్ బాబు కొత్త, ప్రభాకర్ కొప్పోలు, నాగరాజు, నవీన్, సాయిప్రశాంత్, శుశ్రుత, సంతోష్ కిరణ్ వరద, సరితా కోటికే, శ్రీదేవి, విజయ్, శివ మాలెంపాటి, వినోద్ రెడ్డి తుపిలి, గౌరీధర్, సత్య నాగేందర్ గుత్తుల, రాజ్ కిరణ్ మూట తదితరులను వేడుకల్లో పాల్గొన్న మహిళలు అభినందించారు.

‘తామా’ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసిన అట్లాంటా ప్రజానీకం, స్పాన్సర్స్, ఆడియో లైటింగ్ అందించిన శ్రీనివాస్ దుర్గం, ఫోటోగ్రఫీ సేవలందించిన సురేష్ ఓలం, స్టేజీ, ఫోటోబూత్‌లను చక్కగా అలంకరించిన ఉదయ ఈటూరు, మీడియా సహకారం అందించిన టీవీ9 శివకుమార్ రామడుగు, టీవీ5, మనటీవీ ప్రవీణ్ పురం, టీవీ ఆసియా అంజలి చాబ్రియా తదితరులకు ‘తామా’ అధ్యక్షులు వెంకీ గద్దె  ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement