TAMA
-
ఘనంగా ‘తామా’ బతుకమ్మ, దసరా వేడుకలు
అట్లాంటా తెలుగు సంఘం 'తామా' ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా బతుకమ్మ, దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదావరి రెస్టారెంట్, మాగ్నమ్ ఓపస్ ఐటీ, డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అమెరిన్డ్ సోలుషన్స్, డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి సమర్పణలో సెప్టెంబర్ 28న ఈ వేడుకలు జరిగాయి. ఇందులో సుమారు 1700 మందికి పైగా మహిళలు, చిన్నారులు పాల్గొని రంగురంగుల బతుకమ్మలతో సందడి చేశారు. ప్రపంచమంతా నివసిస్తున్న తెలుగువారు అత్యంత విశిష్టమైన బతుకమ్మ పండుగను భాద్రపదమాసములో జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఘనంగా జరిగే ఈ పండుగ గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోని అన్ని ప్రాంతాల తెలుగువారు నిర్వహిస్తున్నారు. ఏడు వరుసల్లో రంగు రంగుల పూలను పేర్చి, పసుపుతో గౌరమ్మను బతుకమ్మపైన పెట్టి రెండు అగరుబత్తులను వెలిగించి.. అన్ని బతుకమ్మలను ఒక ప్రాంగణంలో పెట్టి మహిళలు, ఆడపిల్లలు బతుకమ్మల చుట్టూ వృత్తాకారంలో చప్పట్లు కొడుతూ తిరుగుతూ ఆడిపాడారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఇండియా నుంచి ప్రముఖ జానపద గాయకులు డా. శ్రీనివాస లింగా హాజరయ్యారు. ఆయన తన పాటలతో అందరిని ఆకట్టుకున్నారు. లింగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలోని యాసలతో పాటలు వినిపించడం కార్యక్రమానికే ఒక వన్నె తెచ్చింది. దాదాపు 500 మహిళలు 100 పిల్లలు లింగా పాటలతో రెండు గంటలపాటు బతుకమ్మ ఉత్సాహంగా ఆడి అనంతరం నిమజ్జనం చేశారు. ఈ బతుకమ్మ పోటీల్లో న్యాయమూర్తులుగా వ్యవహిరంచిన స్నేహ బుక్కరాయసముద్రం, కనకలక్ష్మి చింతల, గీత వేదుల విజేతలను ప్రకటించారు. గెలచిన విజేతలకు రమేష్ అన్నాబత్తుల, విజు చిలువేరు బహుమతులను అందజేశారు. ప్రియా బలుసు ట్రివియా బహుమతులు, మహేష్ పవార్ కోలాటం కర్రలు స్పాన్సర్ చేశారు. బతుకమ్మ ఆటకు ముందు ప్రేక్షకులకు ఒక ప్రశ్నావళి నిర్వహించి.. అందులో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులను అందచేశారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న శశికళ పెనుమర్తి, నీలిమ గడ్డమణుగు, శాంతి మేడిచెర్ల, శ్రీదేవి దాడితోట, హేమశిల్ప ఉప్పల, శ్రీవల్లి శ్రీధర్, దాస్యం మాధవిలు పెద్దలను, చిన్నారులను ఆకట్టుకున్నారు. బతుక్మ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంలో అన్ని శాఖల్లో అత్యంత మక్కువతో పనిచేసిన కార్యకర్తలు.. వెంకీ గద్దె, భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, ప్రియా బలుసు, సుబ్బారావు మద్దాళి, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, రవి కల్లి, బిల్హన్ ఆలపాటి, సురేష్ బండారు, రూపేంద్ర వేములపల్లి, భరత్ అవిర్నేని, శ్రీవల్లి శ్రీధర్, వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, విజు చిలువేరు, మహేష్ పవార్, రామ్ మద్ది, రామ్కిచౌడారపు, రమేష్ కోటికే, శ్రీనివాస్ కుక్కడపు, రమేష్ వెన్నెలకంటి, బాలనారాయణ మద్ద, శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, వెంకట్ మీసాల, విజయ్ రావిళ్ల, సురేష్ దూలిపుడి, మోహన్ ఈదర, శ్రీనివాస్ గుంటక, సుధాకర్ బొర్రా, యశ్వంత్ జొన్నలగడ్డ, విజయ్ బాబు కొత్త, ప్రభాకర్ కొప్పోలు, నాగరాజు, నవీన్, సాయిప్రశాంత్, శుశ్రుత, సంతోష్ కిరణ్ వరద, సరితా కోటికే, శ్రీదేవి, విజయ్, శివ మాలెంపాటి, వినోద్ రెడ్డి తుపిలి, గౌరీధర్, సత్య నాగేందర్ గుత్తుల, రాజ్ కిరణ్ మూట తదితరులను వేడుకల్లో పాల్గొన్న మహిళలు అభినందించారు. ‘తామా’ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసిన అట్లాంటా ప్రజానీకం, స్పాన్సర్స్, ఆడియో లైటింగ్ అందించిన శ్రీనివాస్ దుర్గం, ఫోటోగ్రఫీ సేవలందించిన సురేష్ ఓలం, స్టేజీ, ఫోటోబూత్లను చక్కగా అలంకరించిన ఉదయ ఈటూరు, మీడియా సహకారం అందించిన టీవీ9 శివకుమార్ రామడుగు, టీవీ5, మనటీవీ ప్రవీణ్ పురం, టీవీ ఆసియా అంజలి చాబ్రియా తదితరులకు ‘తామా’ అధ్యక్షులు వెంకీ గద్దె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. -
తామా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా సంబరాలు
అట్లాంటా : అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో ఇన్ఫోస్మార్ట్ టెక్నాలజీస్ అధినేత కరుణాకర్ రెడ్డి అసిరెడ్డి పర్యవేక్షణలో నారీమణుల కోసం ప్రత్యేకంగా మహిళా సంబరాల కార్యక్రమం జరిగింది. దాదాపు 400 మందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా తామా కార్యవర్గ వనితలు శ్రీవల్లి శ్రీధర్, ప్రియ బలుసు, శిల్ప మద్దినేని, గౌరి కారుమంచి, హరిప్రియ దొడ్డాక, నీరజ ఉప్పు, ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీవల్లి, శిల్ప ఉప్పులూరి, స్రవంతి, పూజిత, పూర్ణిమ అర్జున్, రాగ వాహిని, భానుశ్రీ వావిలకొలనులు తమ గాత్రంతో ప్రేక్షకుల అలరించారు. వీణావాయిజ్యకారిణి ఉష మోచెర్ల, శాంతి మేడిచెర్ల వివిధ ప్రాంతీయ నృత్యాలతో మయూర వన్నెల నాట్య శిఖామణులు, యాంకర్‌గా రాగ వాహిని మాట చాతుర్యతతో అందరినీ ఆకట్టుకున్నారు. అధిక బరువు, మానసిక ఒత్తిడికి సంబంధించి డాక్టర్ నందిని సుంకిరెడ్డి, డాక్టర్ సౌమ్య రెడ్డి తమ అమూల్యమైన సూచనలు సలహాలు అందించారు. తామా సహకారంతో ప్రతి శనివారం నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి గురువులను సత్కరించారు. 'ఆడజన్మ' ప్రదర్శన అందరి హృదయాలను ఆకట్టుకుంది. దాస్యం మాధవి 'స్త్రీ తత్వం' అనే కవితాంశతో ప్రారంభించి ఆడజన్మను మొదలుకొని ఒక స్త్రీ తన జీవిత కాలంలో తను ఎదుర్కొని పోరాడే ఒక్కో అంశాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తూ రమణీయంగా అభివ్యక్తపరిచారు. పాటలతో, ఆటలతో, మాటలతో నవరసాలను పండించారు. అంతే కాకుండా 'తెలుగు అమ్మాయి' పోటీ నిర్వహించి పలురకాల వైవిధ్య పరీక్షలతో పోటీదారులలో ఉత్సాహాన్ని నింపి వారిలో అత్యుత్తమంగా రాణించిన కొందరు నారీమణులకు విశిష్ఠ అతిథుల చేత బహుమానాలను అందింపచేసారు. ఈ సందర్భంగా విజేతలకు కాంత్ పొట్నూరు, సునీత పొట్నూరు బహుమతులను అందజేశారు. అలాగే కే.బి. జవేరి జువెలర్స్ డికేటర్ సమర్పించిన డైమండ్ రింగ్ తోపాటు ఇతర రాఫుల్ బహుమతులను కూడా విజేతలకు అందించారు. రేఖ హేమాద్రిభొట్ల, దీప్తి అవసరాల, గౌతమీ ప్రేమ్, కల్పనా పరిటాల, సుష్మ కిరణ్ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో తమవంతు కృషి చేశారు. -
‘తామా’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
అట్లాంటా : తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(తామా) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక మెడోక్రీక్ హైస్కూల్లో నిర్వహించిన శ్రీ వికారి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలలో సుమారు రెండు వేల మందికి పైగా పాల్గొనగా తెలుగు సినీగాయని గీతామాధురి తన పాటలతో ఉర్రూతలూగించారు. ముందుగా పిల్లలకు క్యూరీ లెర్నింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాత్ బౌల్, స్పెల్ మాస్టర్ ఛాలెంజ్ పోటీలలో సుమారు 200 మంది పిల్లలు పోటీపడ్డారు. పొటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. సాంస్కృతిక కార్యదర్శి సుబ్బారావు మద్దాళి ఉగాది శుభాకాంక్షలతో అందరికి స్వాగతం పలుకగా, తామా కార్యవర్గ సభ్యులు వెంకీ గద్దె, భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, ప్రియ బలుసు, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, రవి కల్లి, సురేష్ బండారు, రూపేంద్ర వేములపల్లి, భరత్ అవిర్నేని, శ్రీవల్లి శ్రీధర్ బోర్డు సభ్యులు వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, ఆనంద్ అక్కినేని, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, అలాగే గాయని గీతా మాధురి, వ్యాఖ్యాత సమీరా విఘ్నేశ్వరునికి జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య పాఠశాలలవారు ప్రదర్శించిన సినిమా నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, జానపద గీతాలు, ఫ్యాషన్ షో, యాంకర్ సమీరా వ్యాఖ్యానం అందరిని అబ్బురపరిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నవారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. తామా కార్యవర్గం, బోర్డు సభ్యుల చేతులమీదుగా స్పాన్సర్స్, సింగర్ గీతా మాధురి, యాంకర్ సమీరా, జార్జియా హౌస్ ప్రతినిధి టాడ్ జోన్స్‌లను పుష్పగుచ్చం, శాలువ,జ్ఞాపికలతో సత్కరించారు. ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో ఆభరణాలు, వస్త్రాలు, ప్రత్యేక ఆహార పదార్థాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ సత్యనారాయణ స్వామి గుడి పూజారి రవి మేడిచెర్ల గారు పంచాంగ శ్రవణం చేశారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ భరత్ మద్దినేని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమవంతు సహాయసహకారాలు అందించిన ఆడియో లైటింగ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సేవలందించిన వాకిటి క్రియేషన్స్ శ్రీధర్ రెడ్డికి, వేదికను అందంగా అలంకరించిన మేరీగోల్డ్ ఈవెంట్స్ సుజాత పొన్నాడకి, మెడోక్రీక్ హై స్కూల్ యాజమాన్యానికి, స్పాన్సర్స్‌కి, వాలంటీర్స్ శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ ఎలమంచిలి, రాజేష్ జంపాల, రామ్ మద్ది, ఉపేంద్ర నర్రా, శ్రీని బలుసు, విజయ్ కొత్త, విజయ్ కొత్తపల్లి, గిరి సూర్యదేవర, మురళి బొడ్డు, సురేష్ ధూళిపూడి, బాల మడ్డ, అనిల్ కొల్లి, వెంకట్ అడుసుమిల్లి, మహేష్ పవార్, వెంకట్ మీసాల, శ్రీరామ్ రొయ్యల, యశ్వంత్ జొన్నలగడ్డ, హేమంత్ వర్మ పెన్మెత్స, రమేష్ వెన్నెలకంటి, సాన్వి, అక్షు, మోనిష్, తనీష్, రితిక్, రుషీల్, అఖిల్, వంశి కనమర్లపూడి, శ్రీనివాస్ కుక్కడపు, సంతోష్, సరితా, గౌతమి ప్రేమ్, సత్య నాగేందర్, అనిల్, నగేష్ మాగంటి, మూర్తి మొల్లివెంకట, శ్రీనివాస్ గోలి, శ్రీనివాస్ కోడెల, గిరిధర్ కోటగిరి, శశి కేలం, అప్పారావు గోపు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. -
తామా ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
అట్లాంటా : అట్లాంటా తెలుగు సంఘం 'తామా' ఆధ్వర్యంలో భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిడిల్ స్కూల్లో నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 300 మంది బాలబాలికలు, 200 మంది పెద్దలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా తామా అధ్యక్షులు వెంకీ గద్దె స్వాగతోపన్యాసం చేస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యం గురించి వివరించారు. సిలికానాంధ్ర మనబడి ప్రతినిధి విజయ్ రావిళ్ల, తామా చైర్మన్ వినయ్ మద్దినేనిలు ఉపాధ్యాయులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ వంటి దేశభక్తి గీతాలను శ్రద్ధగా ఆలపించారు. తదనంతరం విజయ్ రావిళ్ల జెండా వందనం చేయగా, అందరూ జాతీయగీతం ఆలపించి భారతావనిపై తమకున్న గౌరవాన్ని తెలియజెప్పారు. వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం కంటే అత్యధికంగా 500 మందికి పైగా పాల్గొనడం విశేషం అంటూ అక్కడికి విచ్చేసిన అందరూ తామా కార్యవర్గాన్ని కొనియాడారు. ఇంతమంది తెలుగు వారు ఇలా మన జాతీయ పండుగను చేసుకోవటం హర్షణీయం అని ప్రశంసించారు. ఈ కార్యక్రమం భారత దేశంలో చిన్నప్పుడు తమ స్కూళ్లలో జరిగినట్లు ఉందని, ఆ రోజులను తామా వారు తమకు గుర్తుచేసినందుకు, తమ పిల్లలు ఇందులో భాగం కావటం పట్ల చాలా మంది పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పిల్లలకు గుడీ బ్యాగ్స్, పెద్దలకు స్నాక్స్ అందించారు. చివరిగా స్నాక్స్ స్పాన్సర్ చేసిన అట్లాంటా ఫుడ్ డిస్ట్రిబ్యూటర్స్, వేడుకల నిర్వహణలో సహకరించిన తోటి తామా కార్యవర్గ సభ్యులు, బోర్డు సభ్యులు, మనబడి సమన్వయకర్తలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరికీ తామా అధ్యక్షులు వెంకీ గద్దె కృతజ్ఞతలు తెలిపారు. -
అట్లాంటాలో వీనుల విందుగా 'తామా' సంక్రాంతి సంబరాలు
అట్లాంటా : అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వీనుల విందుగా జరిగాయి. స్థానిక నార్క్రాస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ సంబరాలను శూరా ఈబి 5 ఫండ్, మై టాక్స్ ఫైలర్, సంక్రాంతి రెస్టారెంట్ వారు సమర్పించగా, సుమారు 1200 మందికి పైగా హాజరయ్యారు. ముందుగా పిల్లలకు ప్రత్యేకంగా నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ కళ, ది యంగ్ లీడర్స్ అకాడమీ ఉపన్యాసం పోటీలలో సుమారు 250 మంది పిల్లలు పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ముగ్గుల పోటీలు, మెహిందీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యదర్శి సుబ్బారావు మద్దాళి స్వాగతోపన్యాసం చేయగా, తామా కార్యవర్గం, బోర్డు సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ప్రదర్శించిన జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినీ పాటలు, నృత్యాలు, శ్లోకాలు అందరిని ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు. అధ్యక్షులు వెంకీ గద్దె ప్రసంగిస్తూ తామా నిర్వహించే ఉచిత క్లినిక్, స్కాలర్షిప్స్, మనబడి, స్పోర్ట్స్, సాహిత్యం, తదితర విద్య, వైద్యం, వినోద కార్యక్రమాలను వివరించారు. తామా కార్యవర్గం, చైర్మన్ వినయ్ మద్దినేని సారథ్యంలో బోర్డు సభ్యుల చేతులమీదుగా స్పాన్సర్స్ శ్రీనివాస్ నిమ్మగడ్డ, హరిప్రసాద్ సాలియాన్, జాన్స్ క్రీక్ డిస్ట్రిక్ట్ 50 హౌస్ ప్రతినిధి ఏంజెలికా కౌషె, హిందూ టెంపుల్ ప్రెసిడెంట్ షీలా లింగం, అట్లాంటా ఐటీ సర్వ్ ప్రెసిడెంట్ క్రిస్ గద్దె, స్కాలర్షిప్స్ సమన్వయకర్త సీత వల్లూరుపల్లి, మనబడి సమన్వయకర్త విజయ్ రావిళ్ల, ఉపాధ్యాయని ఉపాధ్యాయులను సగౌరవంగా సత్కరించారు. మధ్య మధ్యలో గోదావరి రెస్టారెంట్, విజయ కలెక్షన్స్, నేటివ్ ట్రెండ్స్, ఏబీసీ పార్టీ హాల్, కేబీ జవేరీ వారు సమర్పించిన గ్రాండ్ రాఫుల్ విజేతలకు బహుమతులు అందజేశారు. గాయని శిల్ప, గాయకులు ప్రసాద్ సింహాద్రి తమ పాటలతో ప్రేక్షకులను మైమరపించారు. వారి పాటలకు పిల్లలు, యువతీయువకులు వేదిక మీదకు వెళ్లి మరీ డ్యాన్స్ చేయడం విశేషం. గాయని శిల్ప నిర్వహించిన సంప్రదాయ దుస్తుల పోటీలలో మహిళలు, పిల్లలు పాల్గొనగా విజేతలకు బహుమతులు అందజేశారు. నగరంలోని ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో ప్రత్యేక ఆహార పదార్థాలు, ఆభరణాలు, వస్త్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పిల్లలు ఎక్కువగా ఫేస్ పెయింటింగ్ స్టాల్ దగ్గర తిరుగుతూ కనిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్స్ శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి, ఉపేంద్ర నర్రా, వెంకట్ అడుసుమిల్లి, విజయ్ రావిళ్ల, శ్రీని బలుసు, వెంకట్ గోగినేని, విజయ్ కొత్తపల్లి, మురళి బొడ్డు, విజయ్ బాబు కొత్త, యశ్వంత్ జొన్నలగడ్డ, రమణ, చైతన్య, అరుణ మద్దాళి, సునీత పొట్నూరు, అబ్దు, రీమ, సాన్వి, అక్షు, వేదికను అందంగా అలంకరించిన మేరీగోల్డ్ ఈవెంట్స్ సుజాత పొన్నాడ, ఆడియో లైటింగ్ ఫోటోగ్రఫీ అందించిన బైట్ గ్రాఫ్ ప్రశాంత్ కొల్లిపర, రుచికరమైన భోజనాలందించిన సంక్రాంతి రెస్టారెంట్ శ్రీనివాస్ నిమ్మగడ్డ, సమర్పకులు శూరా ఈబి 5 ఫండ్ ప్రసాద్ గద్దె, మై టాక్స్ ఫైలర్ హరిప్రసాద్ సాలియాన్, నార్క్రాస్ ఉన్నత పాఠశాల యాజమాన్యం, వ్యాఖ్యాత శ్రీధర్, ది యంగ్ లీడర్స్ అకాడమీ కమల వడ్లమూడి, గ్లోబల్ ఆర్ట్ సుధ గోపాలకృష్ణన్, తామా కార్యవర్గానికి బోర్డు సభ్యులకు వెంకీ గద్దె ధన్యవాదాలు తెలిపారు. -
అట్లాంటాలో ఘనంగా 'తామా' ఉగాది సంబరాలు
అట్లాంటా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(తామా) ఆధ్వర్యంలో లాంబెర్ట్ స్కూల్లో నిర్వహించిన ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి అట్లాంటా నుంచి భారీగా ప్రవాసాంధ్రులు తరలివచ్చారు. మొదటగా 'తామా' 'అమృత వర్షిణి' ఆధ్వర్యంలో జరిగిన సాహితీ సదస్సు కార్యక్రమంలో పలువురు పిల్లలు, పెద్దలు పాల్గొని కథలు, స్వీయ రచనలు ప్రదర్శించారు. తామా సంస్కృతిక కార్యదర్శి ప్రియా బలుసు స్వాగతోపన్యాసంతో సభను ప్రారంభించారు. యాంకర్ మధు 'తామా' కార్యవర్గ సభ్యులని, బోర్డు సభ్యులని వేదిక మీదకు ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన చేయమని కోరారు. తర్వాత మధు, గాయని సుమంగళి , గాయకుడు ధనంజయ్‌ని ఆహ్వానించి సభకి పరిచయం చేసి సంస్కృతిక కార్యక్రమాలని ఘనంగా ప్రారంభించారు. నగరములో ప్రముఖ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, నాటకాలు, పాటలు, ఆలపించిన శ్లోకాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీవల్లి శ్రీధర్ దర్శకత్వం వహించిన 'తామా' వారి పెళ్లి సందడి నాటకం అతిథులని ఆనంద పరవశంలో ముంచాయి. దాదాపు మూడు వందల మంది కళాకారులు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. తామా కార్యవర్గ సభ్యులు, బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ హర్ష యెర్నేని ఉగాది వేడుక దాతలు మాగ్నమ్ ఓపస్ ఐటి సాగర్ లగ్గిశెట్టి, జీవీఆర్ రియాల్టీ విజయ్ గార్లపాటిని సత్కరించారు. 'తామా' ఉచిత ఆసుపత్రిలో అందించిన సేవలకుగానూ డాక్టర్ శ్రీహరి మాలెంపాటి, డాక్టర్ చైతన్య సూర్యదేవర, డాక్టర్ ఆనంద చుండూరిలను సత్కరించారు. పండితులు ఫణికుమార్ ఉగాది పంచాంగ శ్రవణం సభలోని వారందరూ శ్రద్ధగా ఆలకించారు. తమ తమ రాశిఫలాల వివరాలను ఎంతో ఆసక్తిగా విన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన శ్రీనివాస్ నిమ్మగడ్డ, శ్రీనివాస్ రాయపురెడ్డి, అనిల్ యలమంచలి, సురేష్ ధూళిపూడి, విజయ్ బాబు, అంజయ్య చౌదరి, భరత్ అవిర్నేని, శ్రీనివాస్ లావు, ఉపేంద్ర నర్రా, వెంకట్ అడుసుమల్లి, వినై కొత్తపల్లి, రాజేష్ జంపాల, మల్లిక్ మేదరమెట్ల, సునీల్, వెంకట్ పొలకం, ప్రసాద్ కుందేరు, జగదీష్ ఉప్పల, శ్రీనివాస్ ఉప్పు, ప్రశాంత్ పొద్దుటూరి, రమేష్ వెన్నెలకంటి, అరవింద్ మిర్యాల, మాధవ్ మట్ట, రాజ్ చింతగుంట, కరుణాకర్ బోయినపల్లి, అరుణ్ బొజ్జ, రవి కల్లి, శ్రీనివాస్ గుంటాక, రాకేష్ కున్నాత్, శివ రామ రాజు వేగేశ్న, విష్ణు వైదన, అవినాష్ గోగినేని, రమేష్ కొటికే, మాధవి అల్లాడి, రామ్ మద్ది, విజయ్ రావిళ్ల, బాల నారాయణ మద్ద, మురళి కిలారు, శ్రీనివాస్ విప్పు, రమేష్ వెన్నెలకంటి, సతీష్ బచ్చు, గణేష్ కస్సం, గిరి సూర్యదేవర, హరికృష్ణ ఎల్లప్రోలు, ఆదిత్య పాలమాకుల, శ్రావ్య శ్రీ ఎగలపాటి, పెదబాబు తుర్లపాటి, శివ సబ్బి, నవీన్ పావులూరి, ప్రశాంత్ వీరబొమ్మ, ప్రభాకర్ కొప్పులు, రాహుల్ తోటకూర, రమేష్ యెర్నేని, రుపేంద్ర వేములపల్లి, శ్రీనివాస్ యెర్నేని, శరత్ వేమరాజు, సునీల్ ఎడపగంటి, సురేష్ గాడిరాజు, కిషోర్ దేవరపల్లి, శ్రీధర్ దొడ్డపనేని, శ్రీ హర్ష పులి, శ్రీనివాస్ రెడ్డి కొండా, లోకేష్ బోడేపూడి, రాజేష్ ఆలాగుండుల, రాజేష్ కొమ్మిశెట్టి, రమేష్ సాగర్ కొటికే, భాస్కర్ పిల్లి, రాజేష్ చెప్పప్రాపు, ప్రవీణ్ పురమ్, రామ్ మద్ది, అరవింద్ మిర్యాల, శ్రీకాంత్ కరి, బాలనారాయణ మద్ద, రమేష్ మెడాలకి 'తామా' కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తామా ప్రెసిడెంట్ హర్ష యెర్నేని, తామా సాహితి కార్యదర్శి హేమంత్ వర్మ పెన్మెత్స, కిరణ్ మంచికంటి, వెంకట్ చెన్నుబొట్ల, సుబ్బు భాగవతిలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 'తామా'ఉపాధ్యక్షుడు మనోజ్ తాటికొండ ఉగాది ఉత్సవాలకు విచ్చేసిన ప్రేక్షకులకి, సహాయ సహకారాలు అందించిన వాలంటీర్స్, స్పాన్సర్స్, పర్సిస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసి జాతీయ గీతంతో ఉగాది కార్యక్రమాలని దిగ్విజయంగా ముగించారు. -
స్టేషన్‌మాస్టర్‌గా పనిచేసిన పిల్లి..ఇక లేదు