‘తామా’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు | TAMA Ugadi Celebrations ​held in Atlanta | Sakshi
Sakshi News home page

‘తామా’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

Published Sat, Apr 20 2019 2:21 PM | Last Updated on Sat, Apr 20 2019 2:27 PM

TAMA Ugadi Celebrations ​held in Atlanta - Sakshi

అట్లాంటా : తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(తామా) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక మెడోక్రీక్ హైస్కూల్లో నిర్వహించిన శ్రీ వికారి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలలో సుమారు రెండు వేల మందికి పైగా పాల్గొనగా తెలుగు సినీగాయని గీతామాధురి తన పాటలతో ఉర్రూతలూగించారు. ముందుగా పిల్లలకు క్యూరీ లెర్నింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాత్ బౌల్, స్పెల్ మాస్టర్ ఛాలెంజ్ పోటీలలో సుమారు 200 మంది పిల్లలు పోటీపడ్డారు. పొటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. సాంస్కృతిక కార్యదర్శి సుబ్బారావు మద్దాళి ఉగాది శుభాకాంక్షలతో అందరికి స్వాగతం పలుకగా, తామా కార్యవర్గ సభ్యులు వెంకీ గద్దె, భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, ప్రియ బలుసు, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, రవి కల్లి, సురేష్ బండారు, రూపేంద్ర వేములపల్లి, భరత్ అవిర్నేని, శ్రీవల్లి శ్రీధర్ బోర్డు సభ్యులు వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, ఆనంద్ అక్కినేని, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, అలాగే గాయని గీతా మాధురి, వ్యాఖ్యాత సమీరా విఘ్నేశ్వరునికి జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య పాఠశాలలవారు ప్రదర్శించిన సినిమా నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, జానపద గీతాలు, ఫ్యాషన్ షో, యాంకర్ సమీరా వ్యాఖ్యానం అందరిని అబ్బురపరిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నవారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. తామా కార్యవర్గం, బోర్డు సభ్యుల చేతులమీదుగా స్పాన్సర్స్, సింగర్ గీతా మాధురి, యాంకర్ సమీరా, జార్జియా హౌస్ ప్రతినిధి టాడ్ జోన్స్‌లను  పుష్పగుచ్చం, శాలువ,జ్ఞాపికలతో సత్కరించారు. ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో ఆభరణాలు, వస్త్రాలు, ప్రత్యేక ఆహార పదార్థాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ సత్యనారాయణ స్వామి గుడి పూజారి రవి మేడిచెర్ల గారు పంచాంగ శ్రవణం చేశారు.

ప్రెసిడెంట్ ఎలెక్ట్ భరత్ మద్దినేని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమవంతు సహాయసహకారాలు అందించిన ఆడియో లైటింగ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సేవలందించిన వాకిటి క్రియేషన్స్ శ్రీధర్ రెడ్డికి, వేదికను అందంగా అలంకరించిన మేరీగోల్డ్ ఈవెంట్స్ సుజాత పొన్నాడకి, మెడోక్రీక్ హై స్కూల్ యాజమాన్యానికి, స్పాన్సర్స్‌కి, వాలంటీర్స్ శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ ఎలమంచిలి, రాజేష్ జంపాల, రామ్ మద్ది, ఉపేంద్ర నర్రా, శ్రీని బలుసు, విజయ్ కొత్త, విజయ్ కొత్తపల్లి, గిరి సూర్యదేవర, మురళి బొడ్డు, సురేష్ ధూళిపూడి, బాల మడ్డ, అనిల్ కొల్లి, వెంకట్ అడుసుమిల్లి, మహేష్ పవార్, వెంకట్ మీసాల, శ్రీరామ్ రొయ్యల, యశ్వంత్ జొన్నలగడ్డ, హేమంత్ వర్మ పెన్మెత్స, రమేష్ వెన్నెలకంటి, సాన్వి, అక్షు, మోనిష్, తనీష్, రితిక్, రుషీల్, అఖిల్, వంశి కనమర్లపూడి, శ్రీనివాస్ కుక్కడపు, సంతోష్, సరితా, గౌతమి ప్రేమ్, సత్య నాగేందర్, అనిల్, నగేష్ మాగంటి, మూర్తి మొల్లివెంకట, శ్రీనివాస్ గోలి, శ్రీనివాస్ కోడెల, గిరిధర్ కోటగిరి, శశి కేలం, అప్పారావు గోపు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement