
అమెరికాలోని అట్లాంటలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ జనరల్ స్వాతి కులకర్ణి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఇండియన్ అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ (ఐఏసీఏ) 50వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి పూజా బాత్రా, లిసా క్యూపిడ్, నికోల్. కౌంటీ కమిషనర్లతో పాటు లూసీ కాంగ్రెస్ సభ్యుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేశభక్తి గీతాల ఆలాపన, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
డల్లాస్‌లో
భారత 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకులను అమెరికాలోని డల్లాస్‌లో ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహత్మా గాంధీ విగ్రహం దగ్గర ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. అమెరికా, భారత జెండాలను పట్టుకుని వందేమాతరం, జైహింద్ నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment