indipendence celebration
-
శతమానం భారతి: డెబ్బై ఐదు
75 వ స్వాతంత్య్ర వార్షికోత్సవానికి 75 అనే సంఖ్యను కేంద్ర ప్రభుత్వం అర్థవంతమైన సంకేతంగా మలుచుకుంది. నగరాల అభివృద్ధి లక్ష్యంగా 2001 అక్టోబర్ 5న ఉత్తర ప్రదేశ్‌లో 75 పథకాలకు శంకుస్థాపన చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో 75 వేల మంది లబ్దిదారులకు పక్కా ఇళ్లు నిర్మించి, ఇళ్ల తాళాలు వారి చేతికి అందించింది. ఆ రాష్ట్రంలోనే బ్యాటరీతో నడిచే 75 విద్యుత్ బస్సులను ప్రారంభించింది. ఇక దేశంలో 18 ఏళ్లు పైబడిన, 60 ఏళ్ల లోపు వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో 75 రోజుల పాటు కోవిడ్–19 ముందు జాగ్రత్త టీకా ఉచితంగా వేయిస్తోంది. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాల నేపథ్యంలోనే దేశ విభజన నాటి భయానక ఘటనల సంస్మరణ దినం నిర్వహించాలని నిర్ణయించింది. నాటి విషాదాలకు ప్రతి భారతీయుడి తరఫునా నివాళిగా ఈ నిర్ణయం తీసుకుంది. 75 వారాల అమృత మహోత్సవాలలో దేశం నలుమూలల్నీ కలిపేలా 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లు నడపడంపై ప్రకటన విడుదల చేసింది. అమృత వేడుకల్లో స్వాతంత్య్ర యోధులపై పుస్తకం రాసేందుకు 75 మంది యువ రచయితల్ని ఎంపిక చేసింది. అమృత మహోత్సవాలలో సగటున గంటలకు 4 కార్యక్రమాల వంతున ప్రభుత్వం నిర్వహిం చింది. ఐదు ఇతి వృత్తాల ద్వారా అమృత వేడుకలు ముందుకు సాగేందుకు ప్రణాళిక రూపొందించింది. వేడుక లేని సంకల్పం, కృషి ఎంత గొప్పదైనా నిష్ఫలమే అనే భారతీయ సంస్కృతిని అనునసరించి ప్రభుత్వం ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించి, దిగ్విజయంగా 76 వ స్వాతంత్య్ర దినోత్సవానికి చేరువ అయింది. (చదవండి: చైతన్య భారతి: ఈశాన్య భారత పోరాట వీరుడు టోగన్ సంగ్మా) -
అట్లాంటా, డల్లాస్‌లలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
అట్లాంటా, డల్లాస్‌లలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అమెరికాలోని అట్లాంటలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ జనరల్ స్వాతి కులకర్ణి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఇండియన్ అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ (ఐఏసీఏ) 50వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి పూజా బాత్రా, లిసా క్యూపిడ్, నికోల్. కౌంటీ కమిషనర్లతో పాటు లూసీ కాంగ్రెస్ సభ్యుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేశభక్తి గీతాల ఆలాపన, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. డల్లాస్‌లో భారత 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకులను అమెరికాలోని డల్లాస్‌లో ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహత్మా గాంధీ విగ్రహం దగ్గర ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. అమెరికా, భారత జెండాలను పట్టుకుని వందేమాతరం, జైహింద్ నినాదాలు చేశారు. -
30 దేశాల తెలుగు సంస్థల సహకారంతో వజ్రోత్సవ భారతం
భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్, వేగేశ్న పౌండేషన్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ మరియు రాజ్ కమల్ చారిటీస్లు సంయుక్తంగా ఐదు ఖండాలలోని ముప్పై దేశాల తెలుగు సంస్థల సహకారంతో వజ్రోత్సవ భారతం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. పన్నెండు గంటలపాటు జరిగిన కార్యక్రమాన్ని జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు. సురేఖ దివాకర్ల ఆధ్వర్యంలో పది మంది గాయనీమణులు 75 దేశ భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్, సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, సాయి కుమార్, మాధవపెద్ది సురేష్, ప్రసాద్ తోటకూర, జి వి నరసింహం, డా వంగూరి చిట్టెన్ రాజు, రత్న కుమార్ కవుటూరు, సరోజ కొమరవోలు, శ్రీలత మగతల, కల్నల్ కె ఆర్ కె మోహన్ రావు, లెఫ్టినెంట్ కల్నల్ భాస్కర్ రెడ్డి, విజయ తంగిరాల, జయ పీసపాటి, తాతాజీ ఉసిరికల, దీపిక రావి, విక్రమ్, అనిల్ కుమార్ కందించర్ల, శివ ఎల్లపు, ఎమ్ వి వి సత్యనారాయణ, పృథ్వీరాజ్, వెంకట సురేష్, వేదమూర్తి, ఎస్ డి సుబ్బారావు, వెంకప్ప భాగవతుల, వెంకటేశ్వరరావు తోటకూర, నూనె శ్రీనివాస్, సారథి మోటమర్రి, డాక్టర్ శ్రీదేవి, డోగిపర్తి శంకర్రావు, మధు, సుధామ-రెడ్డి, పార్థసారథి, ధన్‌రాజ్ జనార్ధన్, డాక్టర్ కె ఆర్ సురేష్ కుమార్, డాక్టర్ వెంకటపతి తరిగొప్పుల, వేణుగోపాల్ రెడ్డి బోయపల్లి, డాక్టర్ వ్యాస కృష్ణ బూరుగుపల్లి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ కపటపు, ఉపేంద్ర చివుకుల, శారద సింగిరెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆళ్ళ, డాక్టర్ శ్రీ రామ్ సొంటి, లక్ష్మీ రాయవరపు, గుణ ఎస్ కొమ్మారెడ్డి, లలితా రామ్, శ్రీదేవి జాగర్లమూడి, రమ వనమా, శారద కాశీవజ్ఝుల, డాక్టర్ హరి ఇప్పనపల్లి, రాజేష్ ఎక్కల, మల్లిక్ పుచ్చా, జయరామ్ ఎర్రమిల్లి, డాక్టర్ వెంకటా చారి, రాధిక మంగిపూడి, కళ్యాణి, సింగింగ్ స్టార్ విజయలక్ష్మి, హేమవతి, బి వి ఎల్ ఎన్ పద్మావతి, వి కె దుర్గ, మాధవీ రావూరు, సుజా రమణ, సుందరి టి, లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు, తెన్నేటి సుధా దేవి, శైలజ సుంకరపల్లి, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయ్యిందని వంశీ రామరాజు తెలిపారు. -
సమన్యాయం కోసమే వికేంద్రీకరణ
రూపం మార్చుకున్న అంటరానితనం ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేరం. అయినా విద్యాపరంగా అంటరానితనం పాటించాల్సిందే అన్నట్లుగా కొందరి వాదనలు ఉంటున్నాయి. మా పిల్లలు, మా మనవళ్లు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదవాలి. పేద పిల్లలు మాత్రం చదవడానికి వీల్లేదు అన్న వాదనలు చూస్తే రూపం మార్చుకున్న అంటరానితనం బాహాటంగా కనిపిస్తోంది. ఇది ధర్మమేనా అని ప్రశ్నించుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందేవిధంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా త్వరలోనే విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన గాయాలు మానాలన్నా, భవిష్యత్తులో మరెన్నడూ అటువంటి గాయాలు తగలకుండా జాగ్రత్త పడాలన్నా పరిపాలన వికేంద్రీకరణే సరైన మార్గమని, ఇందుకోసమే మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చామన్నారు. దేశ 74వ స్వాతంత్య్ర దిన వేడుకలను విజయవాడలో శనివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ముఖ్యమంత్రి ఆవిష్కరించిన అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదాను సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తూనే ఉంటాం. కేంద్రంలోని ప్రభుత్వానికి పార్లమెంటులో సొంతంగా మెజారిటీ ఉంది. మిగతా పార్టీల మద్దతు మీద ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు వారు ఇచ్చే అవకాశం కనిపించకపోయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదాను కచ్చితంగా సాధించాలన్న ధృఢ సంకల్పంతో ఉన్నాం. హోదా ఇచ్చేదాకా కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం. 2022 నాటికి పోలవరం పూర్తి – సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితులలోనూ పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలోనే 6 ప్రాధాన్యతా ప్రాజెక్టులు.. వంశధార ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్–1, అవుకు టన్నెల్–2, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. మన నీటి ప్రయోజనాల విషయంలో రాజీలేదని ఆచరణ ద్వారా చూపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.9 వేల కోట్ల సబ్సిడీని ఉచిత విద్యుత్‌కు చెల్లిస్తోంది. రైతులకు ఉచిత విద్యుత్ పథకం పది కాలాలు పదిలంగా ఉండేలా కొత్తగా 10 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ప్రారంభిస్తాం. చదువే నిజమైన ఆస్తి – తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లిష్ మీడియంను ఒక హక్కుగా అమలు చేస్తున్నాం. చదువే నిజమైన ఆస్తి, చదువే నిజమైన సంపద అని నమ్మి విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చాం. విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థల మీద కొరడా ఝళిపించేందుకు రెండు కమిషన్లు.. తల్లిదండ్రులకు, పిల్లలకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పారిశ్రామిక పురోగతి – రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగాన్ని పెంచేలా ఇప్పటికే ఎంఎస్ఎంఈలకు దాదాపు రూ.1,200 కోట్ల ప్రోత్సాహకాలను, గత ప్రభుత్వం వదిలేసిన బకాయిలను చెల్లించాం. కొత్త పారిశ్రామిక విధానంలో కూడా సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పెద్ద పీట వేస్తున్నాం. వైఎస్సార్ వన్ విధానంలో రాష్ట్రంలో 10 రకాల కీలక సేవల్ని ప్రభుత్వం తరపున సమన్వయం చేస్తున్నాం. ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలను రిజర్వ్ చేసిన మన ప్రభుత్వం.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా చదువులకు మెరుగులు దిద్ది ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ అక్టోబరు 2వ తారీఖున ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. వారందరికీ సెల్యూట్.. – ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి త్యాగం చేసిన మహానుభావులను, వ్యక్తులను ఇవాళ స్మరించుకుంటున్నాం. అదే పద్ధతిలో కోవిడ్ మహమ్మారి నుంచి మనల్ని కాపాడ్డానికి నిరంతరం సైనికుల్లా పనిచేస్తున్న వారందరికీ ఈ సందర్భంగా అందరం సెల్యూట్ చేద్దాం. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నా. అవి ఎన్నికల పథకాలు కావు – రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఈరోజు చేస్తున్న ఖర్చుకు పూర్తి స్థాయి ఫలాలు, ఫలితాలు మరో 10 నుంచి 20 ఏళ్ల తర్వాతే వస్తాయి. కాబట్టి ఇవి ఎన్నికల పథకాలు కావు. ఇవి మన రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక రాజకీయ చరిత్రలో మెరుగైన మార్పుల కోసం.. బాధ్యతతో, మంచి మనసుతో అమలు చేస్తున్న పథకాలు. ఈ పాలనను దేవుడు ఆశీర్వదించాలి. మీ అందరి దీవెనలు ఉండాలి. -
జాతీయ జెండా ఆవిష్కరించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ప్రగతి భవన్లో నిరాడంబరంగా నిర్వహించారు. జాతీయ జెండాను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. కేవలం ముఖ్యనాయకులు, కొద్దిమంది అధికారుల సమక్షంలోనే ఈ వేడుకలను నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్ళి అమరులకు నివాళర్పించారు. దీనిలో భాగంగా దేశానికి సేవ చేసిన వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఆవిర్భావం దగ్గర్నుంచీ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఈసారి వేడుకల వేదికను ప్రగతి భవన్‌కు మార్చారు. సిరిసిల్ల: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో శనివారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే ముందు వరసలో ఉందన్నారు. కరోనా కారణంగా స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వారి సంకల్ప బలానికి సలాం.. నిజామాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశం విడుదల చేశారు. కరోనా బాధితుల కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. వారి సంకల్ప బలానికి నా సలాం అని పేర్కొన్నారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన 74వ స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. విశాఖ జిల్లాలో సుమారు మూడు లక్షలమంది అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పారు. వైఎస్సార్ రైతుభరోసాలో 3.48 లక్షల మంది రైతులకి తొలి విడతగా 194.42 కోట్ల రూపాయలు అందించామని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పాత బకాయిలు, జగనన్న విద్యా దీవెన పథకాలకు 324 కోట్లు విద్యార్థులకి చెల్లించామన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ఇప్పటివరకు జిల్లాలో రూ.102 కోట్లతో 43 వేల మందికి ఉచితంగా వైద్యం అందించామని చెప్పారు. వైఎస్సార్ జలయజ్ణంలో 2022 కోట్లతో 1.3 లక్షల ఎకరాలకి నీరు అందించే ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పథకం పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. దశల వారీగా మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకంలో 3.92 తల్లులకి వారి పిల్లల చదువుల నిమిత్తం 15 వేలు చొప్పున రూ.587 కోట్లు జమ చేశామన్నారు. వైఎస్సార్ ఆసరా పథకంలో 70 వేల డ్వాక్రా గ్రూపులకి 1797 కోట్ల పాత బకాయిలని నాలుగు వాయిదాలలో రుణమాఫీ చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 12 రకాల పెన్షన్ ల క్రింద 4.85 లక్షల మందికి ప్రతీ నెలా 116 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ‘‘వైఎస్సార్ చేయూత కింద మొదటి విడతగా 1.94 లక్షల మందికి రూ.360 కోట్లు వారి ఖాతాలలో జమచేశాం. వైఎస్సార్ మత్స్యకార భరోసాలో 20 వేల మంది మత్స్యకారులకి రూ.20 కోట్లు బదలాయించాం. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం క్రింద 9.98 లక్షల మందికి లబ్ధి చేకూరేలా 123 కోట్ల వడ్డీ బ్యాంకులలో జమ చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తంలో చేనేత కార్మికులకు రూ. 62 లక్షలు అందించాం. జిల్లాలో ఇప్పటి వరకు 12.99 లక్షల కుటుంబాలకి రైస్ కార్డులు అందించాం. జిల్లాలో 12.27 లక్షల మందికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేశాం. జగనన్న వసతి దీవెనలో 85 వేల మందికి 70 కోట్లు మంజూరు చేశాం. వైఎస్సార్ కాపునేస్తంలో 14866 మంది లబ్ధిదారులకి 22 కోట్లు ఆర్థిక సాయం అందించాం. గిరిజనులకి స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించడానికి పాడేరులో డాక్టర్ వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కాలేజీని మంజూరు చేశామని’’ మంత్రి అవంతి పేర్కొన్నారు. మన బడి నాడు- నేడులో మొదటి దశలో 1149 పాఠశాలలని రూ.300 కోట్లతో అభివృద్ధి చేపట్టామని తెలిపారు. జిల్లాలో 3.17 లక్షల మంది విద్యార్థులకి జగనన్న విద్యా కానుక అందిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ లో రూ.125 కోట్లతో 832 పనులు ప్రారంభించామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
కొత్త చట్టం.. జనహితం
సాక్షి, హైదరాబాద్: ‘బూజు పట్టిన పాత రెవెన్యూ చట్టాలు రైతులు, ప్రజలకు అపార నష్టం కలిగించాయి. ఈ నష్టాన్ని నివారించుకునేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. అవినీతికి, అలసత్వానికి అవకాశం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెడతాం’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘పరిపాలనా సంస్కరణలతోనే ప్రజలకు మెరుగైన పాలన అందించడం సాధ్యమవుతుంది. అవినీతిరహిత సుపరిపాలన అందించడానికి ప్రస్తుతమున్న చట్టాలు సరిపోవు. పాత చట్టాలను సమూలంగా మార్చాల్సిన అవసరమొచ్చింది. అందుకే ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని, నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పరిశుభ్రమైన, పచ్చదనం వెల్లివిరిసే గ్రామాలు, మునిసిపాలిటీలను తయారు చేసుకోగలం’అని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం చరిత్రాత్మక గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టేందుకు గడిచిన ఐదేళ్ళలో చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయని ఆయన తెలిపారు. ‘తెలంగాణలో గత ఐదేళ్ళలో పునర్నిర్మాణ ప్రణాళికను ఒక యజ్ఞంలా నిర్వహించాం. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం కోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశాం. విద్యుత్తు, తాగునీరు, రహదారుల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా దేశం ముందు గర్వంగా నిలబడింది’అని తెలియజేశారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సుస్థిర ఆర్థికాభివృద్ధి గత ఐదేళ్లుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. పటిష్టమైన క్రమశిక్షణ వల్ల అవినీతికి ఆస్కారం లేకుండా సత్వరమైన నిర్ణయాలతో ఈ లక్ష్యాన్ని మనం సాధించగలిగాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదిక ప్రకారం, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 14.84% వృద్ధిరేటుతో స్థూల రాష్ట్రీయ జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఆదాయవృద్ధిలో స్థిరత్వం వల్ల సమకూరిన వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించడం వల్ల రాష్ట్ర సంపద ఐదేళ్లలో రెట్టింపైంది. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణలో రూ.4లక్షల కోట్ల విలువైన సంపదుంటే, నేడు రూ.8.66లక్షల కోట్లకు చేరుకోవడం మన ఆర్థిక ప్రగతికి సంకేతంగా నిలుస్తుంది. గడిచిన ఐదేళ్ళలో ఐటీ ఎగుమతులు రూ.52వేల కోట్ల నుంచి లక్షా పదివేల కోట్ల రూపాయలకు చేరుకోవడం మనం సాధించిన ప్రగతికి అద్దం పడుతుంది. గురువారం గోల్కొండలో జరిగిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో గౌరవ వందనం చేస్తున్న పోలీసులు. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. చిత్రంలో సీఎస్ ఎస్కే జోషి 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల అమలుతో నూతన ఒరవడిని ప్రవేశ పెట్టడానికి 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఫైనాన్స్ కమిషన్ల గ్రాంటు నిధులను ఈ ప్రణాళిక అమలుకు ముందే స్థానిక సంస్థలకు విడుదల చేయాలని నిర్ణయించింది. 60రోజుల ప్రణాళికలో ప్రజాప్రతినిధులు, అధికారులు.. ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామాలు, పట్టణాల రూపురేఖల్ని మార్చాలి. మొదటిదశలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. ప్రజాసంఘాలు, ప్రజల భాగస్వామ్యంతో సమగ్రంగా చెత్తనిర్మూలనకు నడుంకట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయిన పిచ్చిమొక్కలు. కూలిపోయిన ఇండ్ల శిథిలాలు. పాడుబడ్డ పశువుల కొట్టాలు. మురుగునీటి నిల్వతో దోమలను సృష్టిస్తున్న గుంతలు, పాడుపడిన బావులు.. ఇవీ రాష్ట్ర వ్యాప్తంగా కనినిపిస్తున్న దృశ్యాలు. వీటన్నింటినీ ఈ 60 రోజుల్లో తొలగించుకోవాలి. నిరుపయోగంగా ఉన్న బోరు బావులను వెంటనే పూడ్చివేయాలి. విద్యుత్ వారోత్సవాలు విద్యుత్ సమస్యల పరిష్కారానికి 60 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యుత్‌శాఖ ప్రజల భాగస్వామ్యంతో పవర్ వీక్ నిర్వహించుకోవాలి. వంగిన కరెంట్ పోల్స్‌ను, వేలాడే వైర్లను సరిచేయాలి. తుప్పుపట్టిన పాత స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ వేయాలి. అన్ని గ్రామాలు, పట్టణాలకు అవసరమైన స్తంభాలు, వైర్లను ప్రభుత్వమే సమకూరుస్తుంది. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు రాష్ట్రంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామం తమకు అవసరమైన నర్సరీలను 60 రోజుల కార్యాచరణలో భాగంగా స్థానికసంస్థల ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి. మొక్కల సంఖ్యను, మొక్కల రకాలను, ఇతర విషయాలలో జిల్లా గ్రీన్ కమిటీ (హరిత కమిటీ) అందించే సూచనలను కచ్చితంగా పాటించాలి. పట్టణ, గ్రామబడ్జెట్లో 10% నిధులను పచ్చదనం పెంచే పనుల కోసం కేటాయించాలి. నిర్దిష్టమైన విధానంలో గ్రీన్ కమిటీ సూచనల మేరకు మొక్కలు నాటాలి. ప్రజల చేత నాటించాలి. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతీ ఇంటికీ ప్రజలు కోరుకునే 6మొక్కలను సరఫరా చేయాలి. ప్రజలంతా ఆ మొక్కలను చక్కగా కాపాడి జాగ్రత్తగా పెంచేలా ప్రేరణ కలిగించాలి. కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేసీఆర్ పంచాయతీరాజ్‌లో ఖాళీలన్నీ భర్తీ పల్లెలను ప్రగతి కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పంచాయతీరాజ్ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. 60రోజుల ప్రత్యేక కార్యాచరణలో ఒక ఆదర్శవంతమైన విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ విధానాన్ని అనుసరించి గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలను ఆయా పాలక మండళ్లు రూపొందించాలి. ఈ ప్రణాళికలు ఖచ్చితంగా గ్రామసభల ఆమోదం పొందాలి. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థలు నిధులు ఖర్చు చేయాలి. తద్వారా పల్లెలు, పట్టణాలు ఓ పద్ధతి ప్రకారం ప్రగతిపథంలో పయనించేందకు వీలుంటుంది. పంచాయతీరాజ్ శాఖలోని అన్ని విభాగాల్లో అన్ని ఖాళీలను వేగవంతంగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటాను 95 శాతానికి పెంచాం. మన రైతాంగ విధానం దేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వ రైతాంగ విధానం యావద్భారతానికి ఆదర్శంగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుబంధు పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎకరానికి ఏడాదికి 8వేల నుంచి 10వేల రూపాయలకు పెంచి, అందిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుబీమా పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకున్న పంట రుణాలను మాఫీ చేయడం కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదనంగా 575 టీఎంసీలు గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల వచ్చే జూన్ నుంచి తెలంగాణ రైతాంగం అదనంగా 575 టీఎంసీల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఏటా 400 టీఎంసీల నీరు లభిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 టీంఎసీలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల ద్వారా 75టీఎంసీల నీటిని నికరంగా వాడుకోవడానికి వీలుంటుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఏడాది నుంచే సాగునీరు అందించడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. జూరాలతో కలిపి పాలమూరు జిల్లాలో నేడు 11లక్షల 20వేల ఎకరాలకు సాగునీరందేలా చేసుకోగలుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత వేగంగా నిర్మించి ఉమ్మడి పాలమూరుతోపాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందిస్తామని తెలియచేస్తున్నాను. ఆరోగ్య తెలంగాణ దిశగా.. ప్రజలందరికీ సంపూర్ణంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. వీటి ఫలితాల ఆధారంగా తెలంగాణ ఆరోగ్య సూచిక ‘హెల్త్ ప్రొఫైల్’తయారు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జంటనగరాల్లో బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తండాల్లో తొలిసారిగా జెండా వందనం గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా మార్చడంతో ఇవాళ మొదటి సారిగా అక్కడ సర్పంచ్‌లు సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురేసుకుంటున్న దృశ్యం ఆవిష్కృతమైంది. పింఛన్లు రెట్టింపు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్లను రెట్టింపు చేసుకున్నాం. దివ్యాంగులకు 3,016 రూపాయలు, ఇతరులకు 2,016 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. వృద్ధాప్య పింఛన్ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57ఏళ్లకరు తగ్గించి పింఛన్‌ను అందించాలని నిర్ణయించాం. ఈ మేరకు అర్హుల జాబితా రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గోల్కొండ ‘కళ’కళ ! సాక్షి, హైదరాబాద్ : గోల్కొండ కోట వేదికగా స్వాతంత్య్ర దినోత్సవం కన్నులపండువగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వందల మంది కళాకారులు గోల్కొండ కోటపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే కళారూపాలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించడానికి సీఎం కేసీఆర్ వస్తున్న తరుణంలో డప్పు చప్పుళ్ల హోరుతో 16 కళారూపాలను ఏకకాలంలో ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల విద్యార్థినులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన సైతం ఆకట్టుకుంది. ప్రగతి భవన్లో జెండా వందనం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయమైన ప్రగతిభవన్‌లో జెండాను ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానానికి చేరుకుని అక్కడి సైనిక స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్చం వుంచి నివాళి అర్పించా రు. అక్కడి విజిటర్స్ బుక్‌లో సంతకం చేశారు. అనంతరం గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించారు. 15వ బెటాలియన్ సహాయ కమాండెంట్ శ్రీధర్ రాజా, మంచిర్యాల డీసీపీ నేతృత్వంలో నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. కవాతులో పాల్గొన్న ఒడిశా పోలీసు కాంటింజెంట్‌కు కేసీఆర్ ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. -
కశ్మీరీలకు భారీ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల ఆ రాష్ట్ర ప్రజలు అత్యంత భారీ ప్రయోజనాలను పొందుతారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. మిగతా దేశ పౌరులంతా ఏయే హక్కులు, ప్రయోజనాలు, సౌకర్యాలను పొందుతున్నారో.. ఆ లాభాలను ఇకపై జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజలు కూడా పొందగలరని కోవింద్ అన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన చట్టం తదితరాలు జమ్మూ కశ్మీర్‌లోని ఆడబిడ్డలకు కూడా న్యాయం అందిస్తాయని కోవింద్ తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఉన్న 370వ అధికరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పది రోజుల క్రితమే తొలగించి, జమ్మూ కశ్మీర్‌ను అసెంబ్లీ సహిత కేంద్రపాలిత ప్రాంతంగాను, లదాఖ్‌ను ఆ రాష్ట్రం నుంచి విడదీసి అసెంబ్లీ రహిత కేంద్రపాలిత ప్రాంతంగాను మార్చాలని ప్రతిపాదించడం తెలిసిందే. దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 నుంచి ఈ కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు ఉనికిలోకి వస్తాయి. స్వాతంత్య్రమంటే అధికార మార్పిడి కాదు.. స్వాతంత్య్రం కోసం పోరాడిన పాత తరాన్ని కోవింద్ గుర్తు చేసుకుంటూ ‘స్వాతంత్య్రమంటే కేవలం అధికార మార్పిడేనని పెద్దలు అనుకోలేదు. జాతి నిర్మాణమనే సుదీర్ఘ, విస్తృత ప్రక్రియలో అదో మెట్టు మాత్రమేనని ఆ మహోన్నత వ్యక్తులు భావించారు. ప్రతీ వ్యక్తి, ప్రతీ కుటుంబం.. అలా మొత్తంగా సమాజ జీవితం బాగుండాలనేది వారి ఆశయం’ అని అన్నారు. ఒకరి జీవన విధానాన్ని లేదా పద్ధతులను చాలా తక్కువ సందర్భాల్లోనే భారత్ వేలెత్తి చూపిందనీ, ఇక్కడ అంతా అన్నింటినీ తేలిగ్గా తీసుకుంటూ, ‘మనం బతుకుదాం, ఇతరులను బతకనిద్దాం’ అనే సూత్రాన్ని అనుసరిస్తారన్నారు. అత్యంత దుర్బలమైన వ్యక్తుల గొంతుకను వినగలిగే సామర్థ్యాన్ని భారత్ ఎన్నటికీ కోల్పోదని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ప్రజలను కోవింద్ అభినందిస్తూ, ప్రతీ ఎన్నిక ఓ కొత్త ప్రారంభాన్ని తెస్తుందని, భారత ప్రజల ఉమ్మడి ఆశలకు ఊపిరి పోస్తుందని అన్నారు. -
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎర్రవరం జంక్షన్ వద్ద పాదయాత్ర విడిది శిబిరం వద్ద వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి వైఎస్ జగన్ శుభాకాంక్షాలు తెలిపారు. ఈ వేడుకల్లో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు బుధవారం వైఎస్ జగన్ విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం నుంచి పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పంద్రాగస్టు వేడుకల్లో జనగామ కళాకారులు
ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమాల్లో ‘ఒగ్గు’ బృందం 220 మందిని గుర్తించిన రాష్ట్ర సాంస్కృతిక విభాగం జనగామ : ఢిల్లీ, హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో ప్రదర్శన నిర్వహించేందుకు జనగామ ఒగ్గు కళాకారులు ఎంపికయ్యారు. జనగామ, బచ్చన్నపేట, మద్దూరు, లింగాలఘనపురం మండలాలకు చెందిన 200 మంది కళాకారులను రాష్ట్ర సాంస్కృతిక విభాగం గుర్తించింది. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో వీరు వివిధ రూపాల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. భారత ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ఈ నెల16న ఢిల్లీలో నిర్వహించే ‘భారత్ పర్వు’ సాంస్కృతిక కార్యక్రమంలో నైపుణ్యాన్ని చాటేందుకు మరో 20 మంది కళాకారులు వెళ్లనున్నారు. పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే ప్రదర్శనల్లో పాల్గొనేందుకు ఈ నెల14న జనగామ నుంచి కళాకారులు బయలుదేరనున్నట్లు సాంస్కృతిక విభాగం కో ఆర్డినేటర్ రవికుమార్ తెలిపారు. సాంస్కృతిక విభాగం రాష్ట్ర డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ, టూరిజం, కల్చరర్ ఎండీ బుర్రా వెంకటేÔ¶ ం కృషితో జనగామ ఒగ్గుకళాకారులకు అరుదైన అవకాశం లభించిందన్నారు.