75 వ స్వాతంత్య్ర వార్షికోత్సవానికి 75 అనే సంఖ్యను కేంద్ర ప్రభుత్వం అర్థవంతమైన సంకేతంగా మలుచుకుంది. నగరాల అభివృద్ధి లక్ష్యంగా 2001 అక్టోబర్ 5న ఉత్తర ప్రదేశ్‌లో 75 పథకాలకు శంకుస్థాపన చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో 75 వేల మంది లబ్దిదారులకు పక్కా ఇళ్లు నిర్మించి, ఇళ్ల తాళాలు వారి చేతికి అందించింది. ఆ రాష్ట్రంలోనే బ్యాటరీతో నడిచే 75 విద్యుత్ బస్సులను ప్రారంభించింది.
ఇక దేశంలో 18 ఏళ్లు పైబడిన, 60 ఏళ్ల లోపు వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో 75 రోజుల పాటు కోవిడ్–19 ముందు జాగ్రత్త టీకా ఉచితంగా వేయిస్తోంది. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాల నేపథ్యంలోనే దేశ విభజన నాటి భయానక ఘటనల సంస్మరణ దినం నిర్వహించాలని నిర్ణయించింది. నాటి విషాదాలకు ప్రతి భారతీయుడి తరఫునా నివాళిగా ఈ నిర్ణయం తీసుకుంది. 75 వారాల అమృత మహోత్సవాలలో దేశం నలుమూలల్నీ కలిపేలా 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లు నడపడంపై ప్రకటన విడుదల చేసింది.
అమృత వేడుకల్లో స్వాతంత్య్ర యోధులపై పుస్తకం రాసేందుకు 75 మంది యువ రచయితల్ని ఎంపిక చేసింది. అమృత మహోత్సవాలలో సగటున గంటలకు 4 కార్యక్రమాల వంతున ప్రభుత్వం నిర్వహిం చింది. ఐదు ఇతి వృత్తాల ద్వారా అమృత వేడుకలు ముందుకు సాగేందుకు ప్రణాళిక రూపొందించింది. వేడుక లేని సంకల్పం, కృషి ఎంత గొప్పదైనా నిష్ఫలమే అనే భారతీయ సంస్కృతిని అనునసరించి ప్రభుత్వం ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించి, దిగ్విజయంగా 76 వ స్వాతంత్య్ర దినోత్సవానికి చేరువ అయింది.
(చదవండి: చైతన్య భారతి: ఈశాన్య భారత పోరాట వీరుడు టోగన్ సంగ్మా)
Comments
Please login to add a commentAdd a comment