సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన 74వ స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. విశాఖ జిల్లాలో సుమారు మూడు లక్షలమంది అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పారు. వైఎస్సార్ రైతుభరోసాలో 3.48 లక్షల మంది రైతులకి తొలి విడతగా 194.42 కోట్ల రూపాయలు అందించామని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పాత బకాయిలు, జగనన్న విద్యా దీవెన పథకాలకు 324 కోట్లు విద్యార్థులకి చెల్లించామన్నారు.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ఇప్పటివరకు జిల్లాలో రూ.102 కోట్లతో 43 వేల మందికి ఉచితంగా వైద్యం అందించామని చెప్పారు. వైఎస్సార్ జలయజ్ణంలో 2022 కోట్లతో 1.3 లక్షల ఎకరాలకి నీరు అందించే ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పథకం పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. దశల వారీగా మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకంలో 3.92 తల్లులకి వారి పిల్లల చదువుల నిమిత్తం 15 వేలు చొప్పున రూ.587 కోట్లు జమ చేశామన్నారు.
వైఎస్సార్ ఆసరా పథకంలో 70 వేల డ్వాక్రా గ్రూపులకి 1797 కోట్ల పాత బకాయిలని నాలుగు వాయిదాలలో రుణమాఫీ చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 12 రకాల పెన్షన్ ల క్రింద 4.85 లక్షల మందికి ప్రతీ నెలా 116 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
‘‘వైఎస్సార్ చేయూత కింద మొదటి విడతగా 1.94 లక్షల మందికి రూ.360 కోట్లు వారి ఖాతాలలో జమచేశాం. వైఎస్సార్ మత్స్యకార భరోసాలో 20 వేల మంది మత్స్యకారులకి రూ.20 కోట్లు బదలాయించాం. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం క్రింద 9.98 లక్షల మందికి లబ్ధి చేకూరేలా 123 కోట్ల వడ్డీ బ్యాంకులలో జమ చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తంలో చేనేత కార్మికులకు రూ. 62 లక్షలు అందించాం. జిల్లాలో ఇప్పటి వరకు 12.99 లక్షల కుటుంబాలకి రైస్ కార్డులు అందించాం. జిల్లాలో 12.27 లక్షల మందికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేశాం. జగనన్న వసతి దీవెనలో 85 వేల మందికి 70 కోట్లు మంజూరు చేశాం. వైఎస్సార్ కాపునేస్తంలో 14866 మంది లబ్ధిదారులకి 22 కోట్లు ఆర్థిక సాయం అందించాం. గిరిజనులకి స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించడానికి పాడేరులో డాక్టర్ వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కాలేజీని మంజూరు చేశామని’’ మంత్రి అవంతి పేర్కొన్నారు.
మన బడి నాడు- నేడులో మొదటి దశలో 1149 పాఠశాలలని రూ.300 కోట్లతో అభివృద్ధి చేపట్టామని తెలిపారు. జిల్లాలో 3.17 లక్షల మంది విద్యార్థులకి జగనన్న విద్యా కానుక అందిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ లో రూ.125 కోట్లతో 832 పనులు ప్రారంభించామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment