
సింగపూర్లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ సాంస్కృతిక పరివారంల సంయుక్తంగా ఉగాది పండగని పురస్కరించుకుని పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ చేతుల మీదుగా శ్రీమద్ భాగవత సప్తాహాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
2022 ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతీరోజు సాయంత్రం 4:30 గంటలకు (సింగపూర్‌టైం రాత్రి 7 గంటలకు) శని, ఆదివారాల్లో రాత్రి 10:30 గంటలకు (సింగపూర్ టైం మధ్యాహ్నం ఒంటిగంట) వర్చువల్‌గా ఈ వేడుకలు నిర్వహిస్తారు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.