ఎమ్‌టీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు | MTF Conducts Ugadi Celebrations in Malaysia | Sakshi
Sakshi News home page

ఎమ్‌టీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

Published Sun, Apr 21 2019 8:40 AM | Last Updated on Sun, Apr 21 2019 8:52 AM

MTF Conducts Ugadi Celebrations in Malaysia - Sakshi

కౌలాలంపూర్‌ : మలేషియా తెలుగు ఫౌండేషన్ (ఎమ్‌టీఎఫ్‌) ఆధ్వర్యంలో వికారి నామ సంవత్సర ఉగాది 2019 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సెలంగూర్ స్టేట్ కౌన్సిలర్ గణపతి రావు, మలేషియా ఇండియా హై కమిషన్ కౌన్సిలర్ నిషిత్ ఉజ్వల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రఖ్యాత గాయకుడు నాగూర్ బాబు (మనో), అతని బృందం హరిణి, సాయిచరణ్, అరుణ్ , సాహితి , శ్రీకాంత్ తదితరులు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించారు. మనో మాట్లాడుతూ విదేశాలలో కూడా మన తెలుగు పండగలు సంస్కృతీ సంప్రదాయాలతో నిర్వహిస్తూ తెలుగూ భాషా, తెలుగు కోసం అహర్నిశలు కష్టపడుతున్న దాతో కాంతారావు, ప్రకాష్‌ని అయన అభినందించారు. 

ఈ కార్యాక్రమములో పాల్గొని విజయవంతం చేసిన తెలుగు వారందరికీ ఎమ్‌టీఎఫ్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా సేకరించిన విరాళాలని చారిటబుల్ ట్రస్ట్‌లకి అందజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జన్మదిన ఏడాదిని పురస్కరించుకొని వారి జ్ఞాపకార్థం వీడియో ప్రెసెంటేషన్, చిన్న స్కిట్ చేసి అందులో పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్‌టీఎఫ్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్, మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి, పీకేకేటీఎమ్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకాష్ రావు, టీఏఎమ్‌ వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ రావు, పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, తెలుగు ఇంటెలెక్చువల్ సొసైటీ ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు, ఒకే కుటుంబం ప్రెసిడెంట్ అప్పన్న నాయుడు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement