ఉగాది రోజు ఊహించని అతిథి.. అలేఖ‍్య తారకరత్న ఎమోషనల్ పోస్ట్! | Alekhya Tarakratna Emotional Post On Ugadhi Festival Celebrations | Sakshi
Sakshi News home page

Alekhya Tarakratna: 'ఆయన ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉంటాయి'.. తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్!

Published Thu, Apr 11 2024 7:53 AM | Last Updated on Thu, Apr 11 2024 8:00 AM

Alekhya Tarakratna Emotional Post On Ugadhi Festival Celebrations - Sakshi

టాలీవుడ్ హీరో తారకరత్న కుటుంబం ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి తన ముగ్గురు పిల్లలతో కలిసి తెలుగు నూతన సంవత్సర పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఉగాది వేడుకలకు స్వయంగా తానే తారకరత్న ఇంటికి వెళ్లారు. పండుగ రోజు సంతోషంగా వారితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని అలేఖ్య తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది.

అలేఖ్య తన ఇన్‌స్టాలో రాస్తూ..'మా లైఫ్‌లో నాన్న లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అంకుల్‌ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉంటాయి. కష్ట, సుఖాల్లోనూ ఎప్పుడు మా వెంటే ఉంటూ ధైర్యం చెప్పే వ్యక్తి. ఎలక్షన్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ మా కోసం ప్రత్యేకంగా రావడం ఇంతకు మించిన సంతోషం లేదు. ఇలాంటి సమయంలో మాతో ఉంటే ఆ విలువేంటో ఆయనకే తెలుసు. ఉగాది రోజును మాకు స్పెషల్‌గా మార్చిన విజయ్‌సాయి అంకుల్‌పై మా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది' అంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరలవుతోంది. కాగా.. గతేడాది గుండెపోటుతో తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement