తెలుగు పంచాంగం ప్రకారం.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి.. ఆదాయం, ఆరోగ్యం, కుటుంబం, కెరీర్, విద్యా, వివాహ పరంగా ఎలా ఉంటుందనే పూర్తి వివరాలను ఉగాది సంబంధిత కథనాలు మీకోసం..
శ్రీ క్రోధి నామ సంవత్సర మేష రాశిఫలాలు (2024–25)
ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–3.
అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)
భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ)
గురువు మే 1 వరకు మేషం (జన్మం)లోను తదుపరి వృషభం (ద్వితీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (లాభం)లోను రాహువు మీనం (వ్యయం)లోను కేతువు (షష్ఠం)లోను సంచరిస్తారు. రోజువారి కార్యక్రమాలలో చాలా సమయపాలన పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు. అందరికీ సహకరిస్తారు. అందరూ మీకు సహక రిస్తారు. భోజనం, మంచి వస్త్రధారణ వంటి వాటిలో మీ కోరికలు తీరతాయి.
అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వేచ్ఛగా కావలసిన రీతిగా హాయిగా జీవనం సాగిస్తారు. కొన్నిసార్లు కార్య విఘ్నమునకు అవకాశం వున్నా పెద్దగా ఇబ్బందికరం కాదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాచరణ చేసి సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే, శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
Comments
Please login to add a commentAdd a comment