
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశం కొలిక్కి వస్తోంది. వారం రోజుల్లో తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారులు కార్యాలయాలను గుర్తించారు. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది రోజున (ఏప్రిల్ 2) లాంఛనంగా ప్రారంభిస్తారు. కొత్త జిల్లాలకు కలెక్టర్, ఒక జేసీ, ఎస్పీని ప్రభుత్వం నియమించనుంది.
రెవెన్యూ డివిజన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. పోలీస్ శాఖలోనూ విభజనకు కసరత్తులు జరుగుతున్నాయి. మరోవైపు ఆర్థిక శాఖ కూడా ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేస్తోంది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల పేర్లు మార్పు, కొన్ని మండలాల జిల్లాల మార్పులు వంటి అంశాలను ప్రభత్వుం పరిశీలిస్తోంది.
చదవండి: (కాలిఫోర్నియా టు అనాతవరం.. సొంతూరిలో సాఫ్ట్‌వేర్ కంపెనీ)
Comments
Please login to add a commentAdd a comment