ఎస్‌టీవీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు | Ugadi celebrations in Stuttgart Germany | Sakshi
Sakshi News home page

ఎస్‌టీవీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

Published Thu, May 16 2019 1:17 PM | Last Updated on Thu, May 16 2019 1:19 PM

Ugadi celebrations in Stuttgart Germany - Sakshi

స్టుట్‌గార్ట్‌ : సమైక్య తెలుగు వేదిక(ఎస్‌టీవీ) ఆధ్వర్యంలో జర్మనీలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.  స్టుట్‌గార్ట్‌లో జరిగిన శ్రీ వికారి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలలో దాదాపు 200మందికి పైగా తెలుగు వారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, వడపప్పు, పానకం పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు, పెద్దలు తమ ప్రదర్శనలతో ఆహుతులను ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ సమైక్య తెలుగు వేదిక టీమ్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్‌ స్టుట్‌గార్ట్‌లో నివాసముంటున్న తెలుగువారు సమైక్యంగా తెలుగు సాంస్కృతిని వ్యాప్తి చేస్తూ, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement