stuttgart
-
ఎస్టీవీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
స్టుట్గార్ట్ : సమైక్య తెలుగు వేదిక(ఎస్టీవీ) ఆధ్వర్యంలో జర్మనీలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్టుట్‌గార్ట్‌లో జరిగిన శ్రీ వికారి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలలో దాదాపు 200మందికి పైగా తెలుగు వారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, వడపప్పు, పానకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు, పెద్దలు తమ ప్రదర్శనలతో ఆహుతులను ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ సమైక్య తెలుగు వేదిక టీమ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ స్టుట్‌గార్ట్‌లో నివాసముంటున్న తెలుగువారు సమైక్యంగా తెలుగు సాంస్కృతిని వ్యాప్తి చేస్తూ, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలని పేర్కొన్నారు. -
ప్రజ్నేశ్ సంచలనం
స్టుట్గార్ట్ (జర్మనీ): మెర్సిడెస్ కప్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ సంచలనం సృష్టించాడు. ఈ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 169వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 7–6 (8/6), 2–6, 6–3తో ప్రపంచ 23వ ర్యాంకర్ డెనిస్ షపోవలోవ్ (కెనడా)పై గెలుపొంది తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 75వ ర్యాంకర్ గిడో పెల్లా (అర్జెంటీనా)తో ఆడతాడు. -
ఫైనల్లో సానియా జోడి
స్టట్గార్ట్: పోర్షె గ్రాండ్‌ప్రి డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్) -కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ సానియా-కారా బ్లాక్ ద్వయం 6-2, 2-6, 10-4తో అంటోనియా లోట్నెర్-అన్నా జాజా (జర్మనీ) జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడి రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. జంకోవిచ్ (సెర్బియా)-అలీసా క్లెబనోవా (రష్యా); సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) జోడిల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో సానియా జంట తలపడుతుంది. డబుల్స్ కెరీర్లో 30వసారి డబ్ల్యూటీఏ టోర్నీ ఫైనల్లోకి చేరిన సానియా 19 టైటిల్స్ సాధించి, 10 సార్లు రన్నరప్‌గా నిలిచింది.