
స్టుట్‌గార్ట్ (జర్మనీ): మెర్సిడెస్ కప్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ సంచలనం సృష్టించాడు. ఈ టోర్నీ తొలి రౌండ్‌లో ప్రపంచ 169వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 7–6 (8/6), 2–6, 6–3తో ప్రపంచ 23వ ర్యాంకర్ డెనిస్ షపోవలోవ్ (కెనడా)పై గెలుపొంది తన కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 75వ ర్యాంకర్ గిడో పెల్లా (అర్జెంటీనా)తో ఆడతాడు.