
చిరంజీవి
తమ అభిమానులకు చేరువగా ఉండేందుకు, అభిప్రాయాలను, సందేశాలను వ్యక్తపరిచేందుకు సినిమా స్టార్స్ సోషల్ మీడియాను ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారు. అలాగే అభిమాన తారలతో టచ్‌లో ఉండటానికి అభిమానులకు ఇదొక మంచి వేదిక. ఈ ఉగాది నుంచి (బుధవారం) తాను సోషల్ మీడియాలో ఎంటర్ అవుతున్నానని మంగళవారం ఓ వీడియో ద్వారా వెల్లడించారు చిరంజీవి. ‘‘ఎప్పటికప్పుడు నా భావాలను నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి, అలాగే నేను అనుకున్న సందేశాలను కానీ, చెప్పాలనుకున్నవి ప్రజలతో చెప్పుకోవడానికి కానీ సోషల్ మీడియాను ఓ వేదికగా భావిస్తున్నాను. ఈ ఉగాది రోజున సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నాను’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు చిరంజీవి. ప్రస్తుతం ‘ఆచార్య’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చిరంజీవి ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment