
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఉగాది సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. విశ్వక్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్‌పై కరాటే రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించారు. రిలీజ్ డేట్ ప్రకటించి, విడుదల చేసిన పోస్టర్‌లో క్లాస్‌తో పాటు మాస్ లుక్‌లో కనిపించారు విశ్వక్ సేన్.
‘‘దాస్ కా ధమ్కీ’ని తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ కె. బాబు, సంగీతం: లియోన్ జేమ్స్.
Comments
Please login to add a commentAdd a comment