
కాస్త టైమ్ దొరికితే చాలు హాలిడేని జాయింట్‌గా ఎంజాయ్ చేస్తారు రాశీ ఖన్నా, వాణీ కపూర్. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎప్పటినుంచో మంచి స్నేహితులని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది జూన్‌లో సింగపూర్‌లో మస్త్ మజా చేసిన వాణీ, రాశీ ఇప్పుడు రోమ్ నగరానికి వెళ్లారు. అక్కడ సరదాగా టైమ్ స్పెండ్ చేస్తూ, నచ్చిన ఫుడ్‌ను ఫుల్‌గా లాగిస్తున్నారు. అందమైన లొకేషన్స్‌లో హ్యాపీగా సెల్ఫీలు దిగుతున్నారు. ఇక్కడున్నది ఆ సెల్ఫీనే.
మరి సినిమాల సంగతేంటీ అంటే... తెలుగు ‘టెంపర్’ తమిళ రీమేక్ ‘అయోగ్య’, తెలుగులో విజయదేవరకొండ సరసన ఓ సినిమా చేస్తున్నారు రాశీ ఖన్నా. ఇక వాణి బ్యాంకులో ఉన్న సినిమాల లిస్ట్ విషయానికి వస్తే.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా రూపొందనున్న సినిమాతో పాటు, రణ్‌బీర్ కపూర్ సరసన ‘షంషేర్’లో నటిస్తున్నారు.