
గీత స్మరణం
పల్లవి :
నిన్ను చూడగానే చిట్టి గుండె
గట్టిగానే కొట్టుకున్నదే... అదేమిటే
నిన్ను చూడకుంటే
రెండు కళ్లు ఒకటినొకటి
తిట్టుకున్నవే... అదేమిటే
॥
ఏమిటో ఏం మాయో చేసినావె
కంటిచూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో
అంటించినావే ఒంటి ఊపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా
॥
చరణం : 1
అంత పెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం
నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీశావే
భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ
ఇట్టా తిరిగేస్తూ తిరగ రాశావే
హే... అలా నువ్వు చీరకట్టి చిందులేస్తే
చీమలా నేను వెంటపడనా
నావలా నువ్వు తూగుతూ నడుస్తు వుంటే
కాపలాకి నేను వెంటరానా
కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రా మరదలా
॥
బృందం: అత్తలేని
కోడలుత్తమురాలు ఓలమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
కోడలా కోడలా
కొడుకు పెళ్లామా ఓలమ్మా
పచ్చిపాల మీద మీగడేదమ్మా
ఆ వేడిపాలలోన వెన్న ఏదమ్మా
చరణం : 2
మోనాలిసా చిత్రాన్ని
గీసినోడు ఎవడైనా
ఈ పాలసీసా అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే దాగివుందని తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే
నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను
తెలుగుభాషలో నాకు తెలిసిన పదాలు అన్నీ
గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నెల మూటలా... వేటూరి పాటలా...
ముద్దుగున్నావే మరదలా
॥
చిత్రం : అత్తారింటికి దారేది.. (2013)
రచన, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : దేవిశ్రీ ప్రసాద్, బృందం