హీరోయిన్గా సమంత చెల్లెలు! | navika kotia to cast as heroine in tamil movie | Sakshi
Sakshi News home page

హీరోయిన్గా సమంత చెల్లెలు!

Published Sat, Oct 18 2014 3:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

హీరోయిన్గా సమంత చెల్లెలు!

హీరోయిన్గా సమంత చెల్లెలు!

బాలనటులుగా చేసినవాళ్లంతా ఒక్కొక్కళ్లూ హీరోయిన్లుగా మారిపోతున్నారు. నిన్న కాక మొన్న జై చిరంజీవలో నటించిన శ్రేయా శర్మ హీరోయిన్ అవ్వగా, ఇప్పుడు నవికా కోటియా కూడా ఆ జాబితాలో చేరిపోయింది. పవన్ కల్యాణ్ నటించి బ్లాక్బస్టర్ విజయం సాధించిన అత్తారింటికి దారేది చిత్రంలో సమంతకు చెల్లెలి పాత్రలో నటించిన నవిక.. ఇప్పుడు ఓ తమిళ సినిమాలో హీరోయిన్గా నటించబోతోంది. యూత్ లవ్స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో శరవణన్ సరసన ఆమె హీరోయిన్గా చేస్తోంది.

ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో శ్రీదేవి చిన్న కూతురిగా మంచి బబ్లీగా కూడా నవిక కనిపిస్తుంది. వెండితెరమీదకు రావడానికి ముందు నవిక బుల్లితెరమీద కూడా కనిపించింది. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్లో ఆమె నటించింది. ఇప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement