
'అత్తారింటికి దారేది' సినీ పరిశ్రమకే దారి చూపింది: రాజమౌళి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ప్రస్తుత నెలకొన్న ఉద్వేగ పరిస్థితుల నడుమ విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించడం చిత్ర పరిశ్రమకు పెద్ద ఉపశమనం కలిగించిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
బాహుబలి సినిమా షూటింగ్తో ప్రస్తుతం బిజీగా ఉన్న రాజమౌళి ఆదివారం తీరిక చేసుకుని అత్తారింటికి దారేది (ఏడీ) సినిమా చూశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని పవన్ను, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను పొగడ్తల్లో ముంచెత్తారు. 'ఏడీ సినిమా కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూశా. పవర్ స్టార్ నటన బాగుంది. కాటమ రాయుడా పాట నాకు బాగా నచ్చింది. త్రివిక్రమ్, పవన్కు ఇద్దరికీ అత్యుత్తమ చిత్రమిది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఏడీ ఇతర సినిమాల విడుదలకు దారి చూపించింది' అని రాజమౌళి ట్వీట్ చేశారు.
More than anything else, AD paved the way for the release of films in these difficult times. This is a big relief for the entire industry.
— rajamouli ss (@ssrajamouli) September 29, 2013
Powerstar all the way…ninnu choodagane and katamarayuda are my best moments..one is Trivikram garu at his best one is PSPK at his best..
— rajamouli ss (@ssrajamouli) September 29, 2013