
వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. వకీల్‌సాబ్ షూటింగ్ పూర్తి చేసుకుని ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అదే ఫ్యాక్టరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ విషయం తెలిసిన పవన్ ఆర్‌ఆర్‌ఆర్ సెట్‌లోకి వెళ్లారు. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళిని కలిశారు. సెట్లో ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.
కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్, చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్నారు. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment