
‘అత్తారింటికి దారివ్వం..’
తార్నాక: తెలంగాణ ఏర్పాటు కాకుండా తరచూ అడ్డుపడుతున్న కేంద్రమంత్రి చిరంజీవి వైఖరికి నిరసనగా ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్ నటించిన చిత్రం ‘అత్తారింటికి దారేది..’ని అడ్డుకుంటామని ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. మంగళవారం ఓయూలో జరిగిన జేఏసీ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఓయూ జేఏసీ చైర్మన్ కరాటే రాజు, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు నెహ్రూనాయక్, ఓయూ అధ్యక్షుడు రవిలు విలేకరులతో మాట్లాడారు.
మొదట సామాజిక న్యాయం అని ప్రగల్బాలు పలికి న చిరంజీవి.. మాటమార్చి 1500మంది తెలంగాణ విద్యార్థుల మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ప్రాం తంలో పవన్‌కళ్యాణ్ సినిమాను ప్రదర్శించొద్దని థియేటర్ల యజమానులకు విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లు సిని మాను కొనవద్దని హెచ్చరించారు.