పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా విడుదల విశాఖలో ఉద్రిక్తతకు దారితీస్తోంది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని సమైక్యవాదులు చెప్తుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం సినిమాను అడ్డుకోనీయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలోని వి మ్యాక్స్ థియోటర్ దగ్గర గందగోళ పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. అత్తారింటికి దారేది చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పైరసి వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇక ఆగస్ట్ లో విడుదల కావల్సిన ఈ సినిమా రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఓవైపు సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ప్రజలు పోరాడుతుంటూ కేంద్రమంత్రి చిరంజీవి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని.... అందుకు నిరసనగానే తాము ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ చిత్రాన్ని అడ్డుకుంటామని సమైక్యవాదులు స్పష్టం చేశారు.
Published Fri, Sep 27 2013 10:50 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement