
డై..లాగి కొడితే....
సినిమా : అత్తారింటికి దారేది
రచన - దర్శకత్వం: త్రివిక్రమ్
గౌతమ్ నంద (పవన్‌కల్యాణ్) తన అత్త కూతురైన ప్రమీలను (ప్రణీత) ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వన్ ఫైన్ డే అత్త కూతురికి తన ప్రేమ విషయం చెబుదామని వెళతాడు. కానీ, అనుకొన్నదొక్కటి అయినదొకటి. గౌతమ్ రూమ్‌లోకి ఎంటరవ్వగానే తాను భరత్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, తనకు రేపు పెళ్లి జరగబోతోంది, అది చెడగొట్టి భరత్‌ని తీసుకు రమ్మని అసలు మ్యాటర్ చెబు తుంది ప్రమీల. ఆ షాక్ నుంచి తేరుకున్న గౌతమ్, ఆమె ప్రియుణ్ణి తీసుకు రావడానికి వెళతాడు. భరత్ తండ్రి సిద్ధప్ప (కోట శ్రీనివాస రావు) పెద్ద ఫ్యాక్షనిస్టు. అతని కొడుకుని కిడ్నాప్ చేయడమంటే మాటలు కాదు. కానీ, గౌతమ్ అడ్డమొచ్చినవారిని రప్ఫాడించి, భరత్‌ను తన వెంట తీసుకెళుతూ కోటకు వార్నింగ్ ఇస్తాడు.
‘చూడప్పా సిద్ధప్పా.. నేను సింహం లాంటోణ్ణి. అది గెడ్డం గీసుకోలేదు.. నేను గీసుకుంటా. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్’.
అని ఆ పంచ్ డైలాగ్‌తో హెచ్చరించి మరీ వెళతాడు. డైలాగ్ అదిరింది కదూ!